చాపేకర్ సోదరులు! అచ్యుతుని రాజ్యశ్రీ
 బాలగంగాధర్ తిలక్ అడుగు జాడల్లో నడుస్తూ చేతిలో భగవద్గీతతో ఉరికంబం ఎక్కిన అపూర్వ సోదరులు చాపేకర్ అన్నదమ్ములు.వీరసావర్కార్ గుండె లో గూడుకట్టుకున్న వారు చరిత్రలో నిలిచిపోయారు.
పూనే దగ్గర ఉన్న చించ్ వాడ పల్లెలో లక్ష్మిబాయి హరిభావు దంపతులకు పుట్టిన ఈఅన్నదమ్ములు దామోదర్ బాలకృష్ణ వాసుదేవ్ చాపేకర్ సోదరులుగా ప్రసిద్ధికెక్కారు.హరిభావు ప్రభుత్వ ఉద్యోగంకి రాజీనామా చేసి సంకీర్తనాచార్యులుగా స్థిరపడ్డారు. ఆయన తండ్రి వృద్ధుడు కాశీకి తీసుకుని వెళ్లమని కోరాడు.హరిభావు కుటుంబం తో కల్సి మూడు ఎద్దు బళ్లమీద కాశీ యాత్ర కి బైలుదేరారు.తిరిగి వస్తుంటే ఒక ఎద్దు చనిపోయింది.హరిభావు ఆయన తమ్ముడు వంతులవారీగా తమభుజంపై కాడితో బండిని లాగారు.అలా దాదాపు 10నెలలకి యాత్ర ముగించుకొని చించ్వాడ చేరారు.
హరిభావు కొడుకులకి సంస్కృతం వైద్యం సంగీతం నేర్పారు.దామోదర్ హార్మోనియం బాలకృష్ణ జలతరంగం వాసుదేవ్ స్వరమండల్ తో తండ్రితో కలిసి భోజనాలు చేస్తు దైవభక్తి దేశభక్తి గీతాలు పాడేవారు.1883_ 84 ప్రాంతం లో ఫడ్కే బ్రిటిష్ ప్రభుత్వం కి వ్యతిరేకంగా పోరాడారు.ఏడెన్ లో బ్రిటిష్ వారు ఆయన్ని జైల్లో పెట్టడం ఆయన ప్రాణాలు వదలటంతో భారతీయులు చలించి పోయారు.యువకులైన చాపేకర్ సోదరులు బ్రిటిష్ వారి కి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం ఐనారు.ముంబైలో విక్టోరియా మహారాణి పాలరాతి విగ్రహంకి తారుపూసి  తమ కసి తీర్చుకున్నారు.1896లో ముంబై ప్లేగు వ్యాధి తో వణికిపోతోంది.పంతంగా ప్రభుత్వం పందిరి కింద మెట్రిక్ పరీక్షలు నిర్వహించాలని తలపెట్టింది.జనం మొత్తుకున్నా వినలేదు.చాపేకర్ సోదరులు ధోవతుల్ని కిరోసిన్ లో ముంచి తాడులాగా పందిరి కి చుట్టేసి నిప్పు అంటించారు.బ్రిటిష్ వారి కి బుద్ధిరాలేదు.పూనేలో కూడా ప్లేగు విజృంభించింది. బ్రిటిష్ ప్రభుత్వం the epidemic diseases actని
 అమల్లోపెట్టడంతో జనం రెచ్చిపోయారు.రాండ్ అనే దురహంకారి ప్లేగు వ్యాధి మిషతో ఇళ్ళను తగులబెట్టించాడు.పూజామందిరాల్లోకి ప్రవేశించి స్త్రీలపై అత్యాచారాలు చేయడంతో తిలక్ తన కేసరి పత్రిక లో తీవ్రంగా దుయ్యబట్టారు.పూనాప్రజలునిరాశలో కుంగిపోయారు.విక్టోరియారాణి వజ్రోత్సవాలు ఘనంగా జరగటం చాపేకర్ సోదరులకి నచ్చలేదు.బొంబాయిలో ప్లేగు కలకత్తా లో భూకంపం! అంతే దామోదర్ రాండ్ ని చంపేశాడు.ప్రభుత్వం తిలక్ నా అనుమానించింది.డబ్బుకి ఆశపడి గణేష్ శంకర్ అనేవాడు చాపేకర్ సోదరులను గూర్చి సమాచారం అందించాడు.అలా ఏప్రిల్ 10 న 1890 లో దామోదర్ ఉరితీయబడ్డారు.తిలక్ అతనికి తను సంతకం చేసిన భగవద్గీత ను ఇస్తే దాన్ని చేతిలో బిగించి పట్టుకుని దైవ స్మరణ చేస్తూ ప్రాణం వదిలారు
ఆయన ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉరితీయబడ్డారు.ముగ్గురు అన్నదమ్ములు 30ఏళ్లలోపువారు.భార్యపిల్లలు  అమ్మ నాన్నలతో దైవ స్మరణ తో కాలంగడుపుతున్న ఆముగ్గురు దామోదర్ చాపేకర్ బాలకృష్ణ చాపేకర్ వాసుదేవ్ చాపేకర్ చరిత్రలో మిగిలిపోయారు🌷
కామెంట్‌లు