సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -283
శుద్ధోదక లవణ న్యాయము
*****
శుద్ధోదకం అంటే పరిశుద్ధం చేయబడిన నీరు అని అర్థం.లవణం అంటే ఉప్పు.
మంచినీరు, ఉప్పు వేరువేరు  భిన్నములైనప్పటికీ విడదీయరాని బంధం కలిగి ఉపయోగపడుతుంటాయనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
అంటే పరిశుద్ధమైన నీటికి ఏ రుచీ వుండదు. ఉప్పు  కలిపితే నీటికి రుచి వస్తుంది. అలా తగు మోతాదులో తీసుకున్న ఉప్పు నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
నీరు మరియు ఉప్పు మానవ మనుగడకు ఎంతో కీలకం.మన దేహంలో డెబ్బై శాతం నీరే ఉంటుందని మనకు తెలుసు.
పంచ భూతాలలో ఒకటైన నీరు మన దేహంలో 72 శాతం అనగా మూడొంతులు ఉంది.
సమస్త జీవకోటికి ఆధారభూతమైన నీటి ప్రాముఖ్యత గురించి వేదాలు ఉపనిషత్తులు,ఇతర ప్రామాణిక గ్రంథాలలోనూ  వివరించబడింది.అలాంటి నీరును ప్రతిరోజూ తగినంతగా తాగక పోతే అనారోగ్య పాలవుతాం.
ఇక ఉప్పు .ఈ ఉప్పును  భారతీయులు షడ్రుచులలో ఒకటిగా చెబుతారు.భూమి మీద  నివసించే మనమే కాదు జంతుజాల మనుగడకు కూడా ఉప్పు ఎంతో అవసరం.
మానవ శరీరంలో ప్రతి అవయవం ఉప్పు మీదే ఆధారపడుతుంది.శరీరం లో జరిగే రసాయనిక చర్యలకూ, దేహంలోని నీటి సమతుల్యతకు కూడా ఉప్పే కీలకమైన పాత్ర పోషిస్తుంది.
అందుకే వేమన ఉప్పు గురించి రాసిన పద్యాన్ని చూద్దామా...
 "ఉప్పు లేని కూడు యొప్పదు రుచులకు/ పప్పు లేని తిండి ఫలము లేదు/అప్పు లేని వాడె యధిక సంపన్నుడు/ విశ్వధాభిరామ వినురవేమ!"
 కూరలో ఎన్ని రుచికరమైన పదార్థాలు వేసి,ఎంత బాగా వండినా  అందులో ఉప్పు లేకపోతే రుచిగా అనిపించదు. అందుకే  "అన్నేసి చూడు - నన్నేసి చూడు" అంటుందట  ఉప్పు .ఈ సామెత తరచూ మన పెద్దలు ఉపయోగిస్తుంటారు. ఇక పప్పు  దేహానికి బలాన్ని కలిగిస్తుంది.అలాగే అప్పుల వల్ల ఆందోళన కలుగుతుంది. సరైన సమయంలో తీర్చక పోతే పరువూ పోతుంది. కాబట్టి ఉన్నంతలో సర్దుకుని అప్పులు లేకుండా జీవించే వాడే అధిక ధనవంతుడు అంటారు వేమన.
భాస్కర శతక కర్త కూడా చదువు గురించి ప్రస్తావిస్తూ "రసజ్ఞత లేని చదువు కూడా ఉప్పు లేని కూర లాంటిదని"  చెప్పారు. 
అలాంటి ఉప్పును మానవులుగా  మనం తగినంత మాత్రమే తీసుకోవాలి."అతి సర్వత్ర వర్జయేత్"అన్న విషయాన్ని మరిచి పోకూడదు.
ఆధ్యాత్మిక వాదుల దృష్టిలో ఈ శుద్ధి చేయబడిన నీరు మరియు ఉప్పు యొక్క బంధం జీవాత్మ పరమాత్మల మధ్య ఉన్న బంధం లాంటిదని అంటారు.
మనిషి జీవించాలంటే పంచభూతాల్లో ఒకటైన నీరు అవసరం.అలాగే మనుగడ సాగించాలంటే ఉప్పు అవసరం.అందుకే వాటికి దైవత్వం ఆపాదించి చెబుతుంటారు.
ఆధ్యాత్మిక వాదులా భౌతిక వాదులా ..ఎవరు చెప్పినా నీరు, ఉప్పు అవసరమని మనకు ఈ శుద్ధోదక లవణ న్యాయము ద్వారా తెలుసుకున్నాం.
 కాబట్టి ఆ రెండూ మన దేహంలో హెచ్చుతగ్గులు అవకుండా  చూసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుదాం. మీరు నాతో ఏకీభవిస్తారు కదూ!"
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏s


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం