పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చెట్లను పెంచాలని స్వామి వివేకనంద ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ జయంతి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని స్వామి వివేకానంద ప్రైవేట్ పాఠశాలలో గ్రీన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థుల చేత గ్రీన్ ఫ్రూట్స్ సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జయంతి మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతోపాటు క్రీడ రంగంలో రాణించాలని సూచించారు. విద్యార్థులు తమ గమ్యంలో అనుకున్నది సాధించాలంటే తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కమలాకర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది
రాధ,మౌనిక, గీత, సునీత, మహేశ్వరి, మొబీనా, కల్పన, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి