కూష్మాoడ దుర్గ "కవిమిత్ర" శంకర ప్రియ.," శీల., సంచార వాణి: 99127 67098

 👌అల కూష్మాoడ వీవె!
     భవ తారిణివి నీవె!
     నవదుర్గా రూపిణి!
              శ్రీమాతా శివాని!
     ( శ్రీమాత పదాలు.,)
🔱ఆది పరాశక్తి .. తాను దరహాసము చేయుచు బ్రహ్మాoడమును సృజించునది. కనుక "కూష్మాoడ" అని పేరు. శ్రీమాతా పరమేశ్వరి .. సూర్య మండలాంతర్వర్తిని. ఆమె తేజోమండల ప్రభావం వలననే, దశదిశలు ప్రకాశించు చున్నాయి. ఆ జనయిత్రి.. త్రివిధ తాప యుక్తమైన సంసారమును; తన ఉదరము నందు ధరించింది. కనుక, "కూష్మాoడ దుర్గ" గా విఖ్యాతి నొందినది
🔱"కూష్మాoడేతి చతుర్ధకం!" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిది దుర్గా దేవీ మూర్తులలో.. నాలుగవది  "కూష్మాoడ" దేవి!
         🚩తేట గీతి పద్యము
        వర కమండలము, ధనుస్సు, బాణము, గద,
 చక్ర, మమృత కలశము, లసత్కమలము,
       ఏడు చేతుల, జపమాల ఎనిమిదవ క
రమున, రాజిల్లు కూష్మాండ! ప్రణుతి ప్రణతి.
        
     ( రచన: అవధాని, కోట రాజ శేఖర్.,)
              *****
 🚩చంపక మాల
    కరపద్మమ్ముల యందునన్ నిరతమున్ క్రాంతిన్ ప్రసాదించుచున్
    సురతో నిండిన పూర్ణమౌ కలశమున్ సొంపాఱ ముల్లోకముల్
     స్థిరమైనట్టి శుభావళుల్ సుమతితో చేకూర్చు నాదేవినా
      సురసన్ శాంభవి ప్రస్తుతించెద నెదన్ శోభిల్లు కూష్మాండగా!
( రచన:- డా. రఘుపతి శాస్త్రుల.,
కామెంట్‌లు