*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* - *శతరుద్ర సంహిత --(0289)*
 శౌనకాది మునులు, సూత మహర్షి సంవాదంలో.....

సద్యోజాతుడు, వామదేవుడు, తత్పురుషుడు, అఘోరుడు, ఈశానుడు - ఐదు శివరూపముల అవతారముల వర్ణన........

*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*


*నందీశ్వర, సనత్కుమార సంభాషణం :*

*నందీశ్వరుడు (నం.) చెపుతున్నారు: 
*3."ఈశానుడు": ఆ తరువాత, పరమాశ్చర్యమును కలిగించే "విశ్వరూపము" అని పిలవబడే కల్పము ప్రారంభం అయ్యంది. తిరిగి ఈ కల్పంలో కూడా, బ్రహ్మ తనకు పుత్రులు కావాలి అనే కొరికను తీర్చుకోవడానికి మౌనంగా మనసులోనే పరమశివ ధ్యానం చేస్తూ తపము ఆచరించారు. అప్పుడు, బ్రహ్మ తపస్సుకు మెచ్చి, సింహనాదము చేస్తూ సమస్త విశ్వాన్ని తనవరూపంగా కలిగిన సరస్వతీదేవి, "ఈశానుడు" గా, పరమేశ్వరుడు ఉద్భవించారు. ఈశానుడుగా ప్రకటితమైన పరమేశ్వరుడు, శుద్ధ స్ఫటికం లాగా తేజస్సు కలిగి, అన్ని ఆభరణాలనూ ధరించి ఉన్నాడు. అంతటా నిండి వున్నవాడు, జన్మ లేనివాడు, అంతా తానే అయున వాడు, అన్నిటినీ ప్రసాదించేవడు, సుందరుడు, అన్ని రూపములు తానే అయినవాడు, అయినా ఏ రూపము లేని వాడు అయిన "ఈశానుని" చూసి, ఆ స్వామియే అన్నీ అని గుర్తించి శ్రావ్యమైన కీర్తనలతో కీర్తించారు. అప్పుడు, బ్రహ్మ ప్రార్ధనలు విన్న "ఈశానుడు", " జటీ", "ముండీ", " శిఖండీ", "అర్ధముండ" అనే నలుగురు కుమారులను అనుగ్రహించారు. ఈ నలుగురు కుమారులూ యోగమార్గమును అనుసరించి, ధర్మమును పాటిస్తూ, యోగగతిని పొందారు. ఇదీ, చివరిది, ఐదవదీ అయిన "ఈశాను" డనే పేరుగల అవతారము.*

*"ఈశాను"డు, ప్రకృతికి భోక్త. క్షేత్రజ్ఞులలో నివాసం ఉంటాడు. "తత్పరుషుడు" గుణములకు ఆశ్రయమై ఉండి, సర్వజ్ఞులలో నివాసం ఉంటాడు. పినాకము ధరించిన శివుడు, "అఘోరు" డుగా ధర్మము కొరకు అన్ని అంగములు కలిగి మన మనసులలో ఉంటాడు. ఇక "వామదేవుడు" అహంకారమునకు అధిష్టానము. ప్రాణము, రూపము, గంధము, పృథివి వీనిని పరమశివుని "సద్యోజాత" రూపముగా చెపుతున్నారు. శంకరుని యొక్క ఈ "సద్యోజాతుడు, వామదేవుడు, తత్పురుషుడు, అఘోరుడు, ఈశానుడు" అనే ఐదు అవతారములు మానవాళికి శ్రేయస్సును కలిగిస్తాయి.*

*ఇతి శివమ్*

*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*

.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ


Nagarajakumar.mvss

కామెంట్‌లు