*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *శతరుద్ర సంహిత --(0294)*
 శౌనకాది మునులు, సూత మహర్షి సంవాదంలో.....

వరాహకల్పము - 9 శివ అవతారముల వర్ణన........ రుద్రని చేత చెప్పబడిన శంకరుని చరిత్ర.....

*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*

*నందీశ్వర, సనత్కుమార సంభాషణం :*

*రుద్రుడు చెపుతున్నారు, అని నందీశ్వరుడు (నం.) చెపుతున్నారు:* 
*బ్రహ్మ దేవా! మొదటి చతుర్యుగ ఏడవ ద్వాపరంలో "శతక్రతుడు - వ్యాసుడు".  నేను యోగమార్గములో నైపుణ్యం కలిగిన "జైగీషవ్యుడు" గా అవతరిస్తాను. కాశీపురములో, గుహలో, కుశాసనముపైన కూర్చుని యోగమును బలపరస్తూ, శతక్రతు వ్యాసునకు సహాయపడుతుంటాను. సంసార సాగరములో కొట్టుకు పోతున్న భక్తలను ఉద్ధరిస్తాను. ఈ నా జైగీషవ్యుని అవతారములో కూడా, సారస్వతుడు, యోగీశుడు, మేఘవాహుడు, సువాహుడు అను పేర్లతో నలుగురు కుమారులు ఉంటారు.*

*మొదటి చతుర్యుగ ఎనిమిదవ ద్వాపరంలో మునులలో శ్రేష్టుడు అయిన "వశిష్ఠుడు - వ్యాసుడు". ఈ వశిష్ఠ వ్యాసుడు వేదములను విభజన చేస్తాడు. నేను "దధివాహనుడు" గా అవతరిస్తాను. ఈ అవతారంలో, కపిలుడు, ఆసురి, పంచశిఖుడు, శాల్వుడు అను యోగులైన నలుగురు కొడుకులు ఉంటారు.*

*మొదటి చతుర్యుగ తొమ్మిదవ ద్వాపరంలో "మునిశ్రేష్ఠుడు అయిన సారస్వతుడు - వ్యాసుడు".  ఈ సారస్వత వ్యాసుడు, నివృత్తి మార్గాన్ని దృఢ పరచడానికి, ధ్యాన మగ్నుడుగా ఉంటారు. నేను సారస్వత వ్యాసునికి, నివృత్తి మార్గాన్ని విస్తరించడానికి సహకరించే "ఋషభుడు" గా అవతరిస్తాను. పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, గిరీశుడు, అను నలుగురు మహాయోగులు నాకు కుమారులై, శిష్యులుగా ఉంటారు.*

*బ్రహ్మదేవా! ఇది, నా తొమ్మిది అవతారాల వివరణ. "ఋషభ" అవతారంలో వ్యాకుల మనసుతో ఉన్న ఎంతో మంది భక్తులను అనుగ్రహించి, వారిని భవసాగరము దాటించాను. నా ఈ "ఋషభ" అవతారము, యోగమును వ్యాపింపచేస్తూ, సారస్వత వ్యాసుని సంతోషపరుస్తూ, నా భక్తులను అందరినీ రక్షిస్తూ ఉంటుంది.*

*ఇతి శివమ్*

*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*

.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ


Nagarajakumar.mvss

కామెంట్‌లు