ఈ ఆశ్వయుజ మాసంలో నరకచతు ర్దశి ముందు రోజున అంటే త్రయోదశి. రోజున పూజించే అలవాటు దక్షిణభారత దేశంలో కాకుండా ఉత్తరభారతదేశంలో హెచ్చుగా ఉంది. ఇదే ధన్రాహ్.
'ధన్ - ధనానికి సంబంధించి పూజించాల్సిన, తరాహ్ నెలలోని పదమూడవ ''రోజు' అని ఈ మాటకి అర్థం.
దీనికి సంబంధించిన సంస్కృత పదమే 'ధన త్రయోదశి (త్రయః 3 + దశి 10-13వ తిథి) అనేది.
నిజానికి లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి అమావాస్య. అందుకే ఆమెని దీపావళి రోజున ప్రత్యేకంగా పూజిస్తారు.
ఆమె ఎప్పుడూ శ్రీహరి వక్షఃస్థలాన ఉంటుంది కాబట్టి ఏ ఏకాదశినాడు శ్రీహరిపూజ విశేషంగా సాగుతుందో ఆ పూజంతా ఆమెకీచెందుతుంది.
అలాకాక త్రయోదశి నాడు ఈ పూజ నెందుకు పెట్టినట్లు?
త్రయోదశి అందునా బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి అనేది అడ్డంకులను తొలగించి ప్రసన్నతని కల్గచేస్తుంది. అందుకే శనిబారినపడిన ఎవరైనా ఆయన పెట్టే విఘ్నాలనీ, ఇబ్బందుల్నీ తొలగించు కోదలిచి శనిత్రయోదశినాడు తైలాభి షేకం చేయించుకుంటారు.
అదే తీరులో ఇక్కడ కూడా దశి అనేది అడ్డంకుల్ని, ఇబ్బందుల్ని నివారించేది అవుతుంది.
మనం ఎవరికో సొమ్మునిచ్చాం. చెప్పిన సమయానికి అవతలి వ్యక్తి ఈయలేదు. మన చేతికి అందలేదు. అనుకుందాం! దీనికి తగిన పరిష్కారం ధన్ తే రాహ్ ధనత్రయోదశీ పూజే.
అలాగే వ్యాపారాభివృద్ధికి ఎవరితో ఋణం అడిగాం. రేపు మాపు అంటూ కాలం జరిగిపోతుంది. దీనికీ ఈ రోజే సరైన పరిష్కారం. ఆవునేతి దీపాల మధ్య లక్ష్మీదేవిని ఉంచి, లక్ష్మీసహస్ర నామాలతో ఆమెకి పూజచేసి ఆమెని గంధజలంతో అభిషేకించి, హారతినిచ్చి, ధూప, దీప నైవేద్యాలని సమర్పించినట్లయితే ప్రసన్నురాలవుతుంది- వాంచి తాల్ని తీరుస్తుంది.
ముత్తైదువులకి వాయనాన్ని సమర్పించుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైనవి గంధం, అక్షతలు, పూలు. అందుకని వీటి వాడకం పూజలో ఎంతగా ఉంటే అంతగా ఆనందిస్తుంది ఆ తల్లి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి