హరివిల్లు 516
🦚🦚🦚🦚
వికసించిన విరులు
ఆరాధనలకర్హమట......!
చాలించిన విరి తనువులు
పరిత్యాగపు చరితలట......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 517
🦚🦚🦚🦚
ఒక్కొక్క నోటు జారి
పోవును వెళ్ళేటప్పుడు.....!
రక్తపు చుక్క మిగులదు
చదువు మోతైనపుడు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 518
🦚🦚🦚🦚
పూటపూటకు టీ త్రాగ
కూడదిలా తలనొప్పికి.....!
మాటిమాటికీ టీ త్రాగ
వలదిలా పొట్ట తృప్తికి.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 519
🦚🦚🦚🦚
పచ్చని పైరుల మధ్యన
ఆత్మస్థైర్య అందాలు......!
వరిధాన్యపు సిరుల జూసి
ఆనందపు పరవశాలు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 520
🦚🦚🦚🦚
బిందెలెన్నియు మోసినా
బరువులు తెలియవు వీరికి...!
పలకరింపులు లేనిదే
పనులు ముగియవు భామలకి..!!
( ఇంకా ఉన్నాయి )
హరివిల్లు రచనలు కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-- 9440522864.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి