హరివిల్లు రచనలు ;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 446
🦚🦚🦚🦚
రాలే పూలను చూస్తూ
నేల రాల్చకు కన్నీళ్ళు.......!
చెట్లకు పూలు పూసేట్లు
చేయాలి ఉన్నన్నాళ్ళు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 447
🦚🦚🦚🦚
నేల రాలి పడుతున్న
ఆకును కాను నేను.......!
చిగురించి ఎదిగి, నీడను
ఇచ్చే చెట్టును నేను......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 448
🦚🦚🦚🦚
నిత్యం చెట్లను నరికిన
నీడన్నది ఉండబోదు...!
నిలువ చోటన్నది లేక
నేడన్నది కానరాదు.....!!
 
🦚🦚🦚🦚
హరివిల్లు 449
🦚🦚🦚🦚
అక్షరాల పుటల వెనక
లక్షల పురిటి నొప్పులు.....!
వెలుగులు వెదజల్లే నిజ
విజ్ఞాన వజ్ర తునకలు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 450
🦚🦚🦚🦚
కాటుక పోవునటుల
కన్నీటిని కార్చుటేల......!
కాటికి పోవునటుల
కిరాతకం చేయుటేల......!!
           ( ఇంకా ఉన్నాయి 
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం