బమ్మెర పోతనా మాత్యులు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 వ్యాసుల వారి భాగవతాన్ని తెలుగులో అనువదించిన  సహజ కవి పండితుడు  వ్యవసాయదారుడై ఉండి  అద్భుతమైన శాశ్వతమైన పని చేసిన  బమ్మెర పోతనా మాత్యులు  వారు రాసిన ప్రతి పద్యం అమృత గుళిక చదువు రాని వారికి కూడా కంటత వచ్చే పద్యాలు అనేకం  ఆయన మనకు అందించారు  పెద్ద పెద్ద కవులు మహా కవులు కూడా చెప్పని  అద్భుతమైన అర్థాలను కూడా చెప్పగలిగిన సత్తా కలిగిన ఏకైక భక్తులు వారు శ్రీకృష్ణుని బాల లీలలను  ఎంత అద్భుతంగా చిత్రించారు  అందరికీ ముద్దులొలికే  చిట్టి బాబు  వీరు మన ఇంట్లో ఉంటేనే బాగుంటుంది అనుకున్నంత ఆప్యాయ  తలను పెంచాడు. గోపికలను కృష్ణుడు  చేసిన అల్లరి మరెవరు చేసి ఉండరు  ఆ లీలలను ఎంత గొప్పగా అటువంటి ఒక పద్యం చదివితే మీకు అర్థం అవుతుంది. గోపికలు యశోద వద్దకు వచ్చి  మా ఇండ్ల నీ కుమారుడు చేసే అల్లరి అంతా ఇంతా కాదు  మేం ఎంతో శ్రమపడి  పాలు పెరుగు దాచుకొని వ్యాపారాత్మకంగా దాని తోనే జీవిస్తున్న మాకు  ఆ పాలు పెరుగు లేకుండా  తాను దొంగలించి అందరకు  పంచి పెడుతున్నాడు అమ్మ  మేము ఇక్కడ ఉండము అని చెప్పడానికి  వచ్చిన సందర్భంలో వ్రాసిన పద్యం. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలపెరుగు మననీడమ్మా  పోయెదెందు అక్కడికైనను మా అన్నల సొరపులాన అంటూ మనవి చేసుకున్నారు. ఇక్కడ మేము ఉండలేము  ఎక్కడికైనా వెళ్ళిపోతాం  మాకు ప్రాణప్రదమైన ఆవుల పైన  మా పుట్టింట్లో  మాకెంతో ఇష్టమైన అన్నలపైన  ఒట్టు వేసి మరీ చెబుతున్నాం  అని చెప్పినప్పుడు యశోద నిర్ఘాంత  పోయింది.
కృష్ణుని వదిలి గోపికలు ఒక క్షణమైనా ఉండగలరా  ఓయమ్మ నీ కుమారుడు అన్నప్పుడు  యశోదతో నీకు  ఎంత చక్కటి అందమైన  బిడ్డ ఉన్నాడమ్మా మారుడు  మన్మధుడు అని అర్థం మా ఇళ్ళలో  పాలు (భాగస్వామి  ఒక భాగం) అలాగే  పెరుగు  (పెరిగిన వాడు)  మననీడమ్మా అంటే  రక్షకుడు  అని అర్థం  రెండవ వాక్యం మనందరికీ కూడా నీడమ్మ  గ్రీష్మ ఋతువులో నీడను ఇచ్చిన మహానుభావులు కృష్ణకు మా అన్నల సాక్షిగా ఆవుల సాక్షిగా చెప్పాము ఇక్కడ నుంచి ఎక్కడకు కదలము అన్న అర్థంలో చెప్పడం  శ్రీకృష్ణ పరమాత్మ పై  పోతన గారికి ఉన్న భక్తి  భాగవతంలో తన అనువాదంలో ఇలాంటి పద్యాలు  కోకొల్లలు  ఎవరు ఎంత ఆలోచిస్తే అన్ని అర్థాలు పుట్టుకు వస్తాయి అందుకే వారి రచన శాశ్వతం.


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం