ఏది సనాతనం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఇంటిలో పూజ పూర్తయిన తర్వాత  పిల్లలు బయలుదేరి వెళ్లబోతూ ఉంటే అదేమిటి ముఖ్య ప్రదక్షణ చేయకుండా వెళతారు  అది రాకపోతే పూజ పరిసమాప్తి కాదు కదా అంటే అప్పుడు వారు ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షణం అంటే తిరగడం అని అర్థం   పరిక్రమల  అనే పేర్లు కూడా ఉన్నాయి  చేతులు జోడించి  దేవుని ధ్యానిస్తూ నమస్కరిస్తూ  ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి ఆ చోటికి చేరుకోవడానికి  ఆలయ ప్రదక్షణం అంటారు. దేవుని చుట్టూ తిరిగే దానిని దైవ ప్రదర్శనమంటారు. దీనివల్ల ఆలయంలోనూ దేవతా విగ్రహంలోనూ నిబిడీ కృతమై ఉండే సానుకూల శక్తి విశ్వశక్తి అని ఆ శక్తి ప్రకటన చేసే వారి శరీరాల్లో చేరి దాని ద్వారా  అది మనసు మీద ప్రభావాన్ని చూపుతోందని పెద్దలు చెప్తారు.
వేప రావి జమ్మి మారేడు ఉసిరి లాంటి  చెట్లకు తులసి మొక్కకు చేసేది  వృక్ష ప్రదక్షణం  ఆరోగ్యం బాగుంటుంది సంతాన అభివృద్ధి జరుగుతుంది  గర్భ దోషాలు తొలగిపోతాయి  నేల మీద పడుకుని అవయవాలన్నీ నేలకు తగిలేట్లుగా ఆలయం చుట్టూ దొర్లుకుంటూ చేసేదాన్ని అంగప్రదక్షిణమంటారు  ఇది ప్రతి చోటా చేయడానికి వీల్లేదు ఆలయ ప్రాంగణంలో మాత్రమే చేయాలి అలాగే  దేవతా నిలయాలైన కొండల చుట్టూ చేసే దాన్ని గిరి ప్రదర్శన అంటారు  దీనివల్ల ఆరోగ్యం ఆధ్యాత్మిక స్థితి పెరుగుతాయి  పూజలు చేసేటప్పుడు మనం  కుడి వైపు తన చుట్టూ తాను తిరగడాన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు  అదే తల్లిదండ్రులకు చేస్తే దానిని పిత్రు ప్రదక్షిణాలు అంటారు  గురువుకు చేసే దాన్ని గురు ప్రదక్షణ అని పిలుస్తారు. అగ్ని ప్రదక్షిణను  ప్రధానమైన ప్రదక్షణగా చెబుతారు  వివాహ సమయంలో వధూవరులు ఉపనయన సమయంలో దత్తత స్వీకార సమయంలో దంపతులు  యజ్ఞ సంపూర్తి సమయంలో ఏక కర్త  అనేక సందర్భాలలో అగ్ని ప్రదక్షణం చేస్తారు. మొత్తం వేసే ద్రవ్యాల ప్రభావం అగ్నిలో ఉండే సుగుణాల కలయికతో ప్రదర్శన ఆచరించే వారికి ఆరోగ్యం  బాగుపడుతుంది  అన్నిటికన్నా ముఖ్యం గో ప్రదక్షిణం  గోవు చుట్టూ తిరిగిన దాని వల్ల వచ్చే ఫలితం అంతా ఇంతా కాదు దీన్ని పుణ్యప్రదమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఉదయం సాయంకాల సమయంలో సూర్యుడికి అర్గే మిచ్చి ఆత్మ ప్రదక్షణ చేస్తే దాన్ని సర్వసిద్ధి ప్రదక్షిణం  అంటారు అని శాస్త్రం చెప్తోంది  ఏ ప్రదక్షణ అయినా 1,3,5,9, 11 లాంటి  బేసి సంఖ్యలో చేయాలి తప్ప సరి సంఖ్యలో చేయరాదు అన్నది  నియమం.


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం