ప్రాసాక్షర గేయం;- -గద్వాల సోమన్న,9966414580
మల్లెపూవు పూసింది
చల్లగాలి వీచింది
వల్లమాలిన ప్రేమతో
పల్లె సీమ పిలిచింది

అక్క తోటకెళ్లింది
మొక్క ఒకటి తెచ్చింది
ఎక్కువ శ్రద్ధ చూపి
మక్కువతో పెంచింది

చిట్టి పాప వచ్చింది
పట్టు గౌను తొడిగింది
చెట్టు కింద చేరింది
మట్టిలోన ఆడింది

అమ్మ ఊరెళ్ళింది
బొమ్మలెన్నొ తెచ్చింది
కొమ్మ మీద కోకిల
కమ్మగా పాడింది 

కామెంట్‌లు