బడిలో చదివే బాలలం
గుడిలో వెలిగే ప్రమిదలం
పచ్చదనంతో ముద్దుగా
మడిలో మొలచే మొలకలం
వనిలో పెరిగే మొక్కలం
గనిలో విలువగు వస్తువులం
మహిలో ప్రగతికి బాటలం
మదిలో ఘనలగు రాజులం
మెడలో మెరిసే మాలలం
జడలో మల్లెలమొగ్గలం
దివిలో పారిజాతాలం
భువిలో మేం జలపాతాలం
పున్నమి నాటి వెన్నెలలం
సన్నజాజి పూతావులం
చిన్నారి పొన్నారి పిల్లలం
కన్నవారి కడుపు పంటలం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి