అభిలాష;- -గద్వాల సోమన్న,9966414580
ఉదయించే సూర్యునిలా
ఉపకారం చేసేస్తాం
ఉద్యమించు వీరునిలా
ముందుడగు వేసేస్తాం

తల్లి వంటి తరువుల్లా  
ఫలాలెన్నో అందిస్తాం
తండ్రిలాంటి గురువుల్లా
బాధ్యతలు నెరవేర్చుతాం

ప్రవహించే ఏరుల్లా
దాహార్తి తీర్చేస్తాం
విహరించే గువ్వల్లా
కనువిందే గావిస్తాం

వికసించే పువ్వుల్లా
పరిమళాలు పంచేస్తాం
మురిపించే పిల్లల్లా
హృదయాలను దోచేస్తాం

రవళించే మువ్వల్లా
సునాదం సృష్టిస్తాం
ముద్దొచ్చే బాలల్లా
అందాలే రువ్వేస్తాం

పుష్పించే తోటల్లా
ఆహ్లాదం ఇచ్చేస్తాం
ప్రేమలొలికే మాటల్లా
మనసులను కదిలిస్తాం

కామెంట్‌లు