సంఖ్య -937
=========
దీపావళి వెళ్లి చవితి పర్వము
పూజలoదుకునే పవిత్రసర్పము
నాగుల చవితి అనెడి నామము
హిందువులకి పవిత్ర దినము
పుట్టలో నాగన్నా శరణం ఉమా!
ఇల్లు పరిసరాలు శుభ్రము
పుట్టకి వేసివచ్చు బంధము
పసుపు దారాలను చుట్టడము
పసుపు కుంకుమలు చల్లడము
ఇంటిల్ల పాది ఉపవాసం ఉమా!
ముందురోజు నానబెట్టు సజ్జలు
గుడ్డచుట్టగానవి మొలకలు
వడపప్పు బెల్లం పాలు ఫలాలు
వత్తులతో చేసే నాగరూపాలు
దంచిన బియ్యం పిండి ఉమా!
పసుపు కుంకుమలు పువ్వులు
హారతి కర్పూరం అగరొత్తులు
పుట్టదగ్గరికి చేరే కుటుంబాలు
నిండుగా చేసేరుగా పూజలు
కొబ్బరికాయ కొట్టేరు ఉమా!
పుట్టలోని నాగన్నా కాపాడమని
నూకనిచ్చేము మాకు మూకనివ్వని
దిగుదిగు నాగా దిగరా నాగని
నీ పుట్టదరికి పాపలొచ్చేరని
కోపించి బుసకొట్టబోకని ఉమా!
దారిలో పంచు ప్రసాదము
అదే ఆరోజుకి ఆహారము
తెల్లవారి పూజా కార్యక్రమము
గారెలు పాయసం విందు భోజనము
ఉపవాసపుణ్యం ఆరోగ్యం ఉమా!
ఉమా మహేశ్వరకుమారపుణ్యం
ఉడిపిలోని సుబ్రహ్మణ్యo
ఆదిశేషుడు సుబ్రహ్మణ్యం
అనంతజ్ఞానం సుబ్రహ్మణ్యం
కార్తికేయుడు మహాశక్తి ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి