* కోరాడ బాలగేయాలు *
నాన్న కూచివే... నువ్వు !
  అమ్మకూచి... అన్నయ్య !!
   అల్లరిలో... మీ రిద్దరూ... 
   మీరొకరిని మించి ఒకరు... !!

చదువు లో  మీ రిరువురూ... 
   పోటా  పోటీ ఎప్పుడూ ... !
 అమ్మకు సాయం నీవైతే... 
నాన్నకు   సాయం అన్నయ్య

ఆటలు అంటే అన్నకు ఇష్టం 
  పాటల్లోన మేటివి నువ్వు 
 కప్పులు,షీల్డులు చూడ ముచ్చటగ 
 ఉన్నవి ఎన్నెన్నో మీ ఇద్దరివీ 

ప్రేమ, అనురాగాలు 
 ఆప్యాయతానుబంధాలతో 
మీకు వారే లోకం... !
   వారికి  మీరే .సర్వస్వం !!

చింతలేని చిన్న
            కుటుంబం మీది !
  సుఖ, సంతో షా 
           నందాలకు లోటేది !!

మీ రెంత గొప్పవాటైనా..... 
  ఎక్కడ మీరు ఉన్నా... 
    అమ్మా, నాన్నల విడవద్దు 
  వారిమనసులు బాధ పెట్టద్దు 
            ******

కామెంట్‌లు