సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -318
సమూహాలంబన న్యాయము
*****
సమూహము అంటే సంఘము,గుంపు. ఆలంబన అంటే పునాది,ఆధారం, మద్దతు అనే అర్థాలు ఉన్నాయి.
సమూహముపై ఆధారపడినట్లుఅని అర్థము.
సంఘములో ప్రతి వ్యక్తి సమర్థుడు కాకపోయినా మొత్తం మీద అందరూ సమర్థులే అని పిలవబడటాన్ని "సమూహాలంబన న్యాయము" అంటారు.
 
ఒక సంఘంలో కాని గుంపులో కానీ అందరూ సమర్థులే వుండరు. ఉదాహరణకు కబడ్డీ జట్టు, క్రికెట్ జట్టు, కోకో జట్టు ఇలా ఆటల జట్లను చూసినప్పుడు ఈ విషయం అవగతం అవుతుంది. ఒకరిద్దరు  సమర్థులు లేకున్నా  అందులోని సమర్థులైన వారి వల్ల విజయాన్ని  పొందడం, అందులోని వారందరినీ సమర్థులుగా గుర్తించడం మనం చూస్తూ వుంటాం.అంటే ఇక్కడ ఉమ్మడి గుర్తింపు పొందడం మనకు కనిపిస్తుంది.
కుటుంబంలోనూ కులములోనూ, సమూహాల్లోనూ  అందరూ బలమైన వారో, విద్యావంతులో,ధైర్య సాహసాలు కలవారో, గుణవంతులో ఉండరు. కానీ వారిలో పై లక్షణాలు ఉన్న వారు వుంటే చాలు. ఆ సమూహాల మొత్తానికి పేరు వస్తుంది.
ఇలా మంచైనా,చెడైనా అందరికీ వర్తిస్తుందన్న మాట.
అందుకే వేమన గారు కులంలోన ఒకడు గుణవంతుడు వుంటే  కులానికి మొత్తం పేరు వస్తుంది అంటారు. అలా ఒక్కరే కాదు ఇంకా  కొందరు వున్నట్లైతే  "అబ్బో! ఆ ఫలానా ఇంటి వారంతా సమర్థులు, గొప్పవారే" అనడం చూస్తూ ఉంటాం.
అలా జట్టుగా గానీ, సమూహము, గుంపుగా గానీ పొందిన మంచి  గుర్తింపులో సాధారణ బలం, సామర్థ్యం, నైపుణ్యం ఉన్న వారు కూడా "గుంపులో గోవిందా- నలుగురితో నారాయణా"అన్న విధంగా  పేరు పొందుతారన్న మాట.
ఈ న్యాయాన్ని బట్టి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే సమూహం సమైక్యంగా ఉన్నప్పుడు ఉమ్మడిగా బలాబలాలు, మంచి చెడులు గుర్తింప బడతాయనీ. విడి విడిగా ఉన్నప్పుడు ఎవరి శక్తి సామర్థ్యాలు వారివే.గుర్తింపబడటం బడకపోవడం అనేది వ్యక్తిగతమైన సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని అర్థమవుతుంది.
మానవుడు సంఘజీవి. సంఘంలో ఒకరిపై ఒకరు ఆధారపడుతూ తమ అవసరాలను తీర్చుకోవడమనేది, ఏదైనా సాధించడమనేది ఇప్పుడే కాదు ఆది మానవుల కాలం నుండీ వుంది.
ఏది ఏమైనా నలుగురితో కలిసి,నలుగురిలో వుంటేనే సామర్థ్యాలలోని  హెచ్చుతగ్గులు బయటికి రాకుండా ఉంటాయి.అందరితో పాటు సమానమైన ఫలాలను,ఫలితాలను  పొందవచ్చు.
"సంఘే శక్తి: కలౌ యుగే" అంటే ఈ కలియుగంలో సంఘబలాన్ని మించిన బలం మరొక్కటి లేదు. కాబట్టి సంఘబలాన్ని కూడగట్టుకుందాం. "సమూహాలంబన న్యాయము" ద్వారా సమైక్యతతో అనుకున్నది సాధిద్ధాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం