న్యాయాలు -313
సముద్రకిట్ట న్యాయము
******
సముద్రము అంటే సాగరము,జలనిధి,పయోనిధి,ఉదధి,జలధి,సంద్రము అనే అర్థాలు ఉన్నాయి.కిట్టము అంటే మలము,సామాన్యము అనే అర్థాలు ఉన్నాయి.
సముద్రములో మలము కానీ ఇంకేదైనా కలుషిత వస్తువు(తేలేది) వేస్తే తిరిగి ఒడ్డుకే వస్తుంది.కానీ సముద్రానికి ఎలాంటి చెడు జరుగదు.
అంటే మంచివారికి కీడు తలపెడితే అది తలపెట్టిన వారికే సంక్రమిస్తుంది కానీ మంచి వారికి ఎలాంటి హాని జరుగదు అనే అర్థంతో ఈ "సముద్రకిట్ట న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
సముద్రము అంటే ఏమిటో దాని యొక్క ప్రత్యేకత ఏమిటో ఓ నాలుగు విషయాలు తెలుసుకుందాం.
సముద్రము అంటే భూమి మీద అత్యధిక స్థలాన్ని ఆక్రమించి రెండు లేదా మూడు భూ ఖండాలను వేరు చేసే ఉప్పు నీటి భాగము.
సముద్రములోనే మొదటి జీవం ఉద్భవించిందనీ, ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని, సముద్రాలు మానవుల మధ్య బంధం విడదీయరానిదని శాస్త్రవేత్తలు చెప్పడమే కాకుండా మనకూ కూడా అంతో ఇంతో తెలుసు.
గాలి వలన సముద్రంలో అలలు ఏర్పడతాయి. ఆ అలల పీడనం కారణంగా సముద్రంలో ఏ వస్తువు వేసినా ఒడ్డుకు కొట్టుకొని వస్తుంది. ఆ విధంగా సముద్రం తనది కానిది ఏదీ తనలో ఉంచుకోకుండా బయటకు విసిరి వేస్తుంది.సముద్రము అనేక రకాలుగా జీవరాశికి మేలే చేస్తుంది కానీ కీడు చేయదు.
అలాగే ఉత్తముడైన మానవుడు కూడా ఎవరికీ ఎలాంటి అపకారం చేయడు.అలాంటి మంచివ్యక్తి జోలికి పోతే ఏమవుతుందో మన పెద్దలు ఇలా సముద్రంతో పోల్చి చెప్పారు.ఎవరైతే సముద్రంలో కలుషితాన్ని వేస్తారో అది మళ్ళీ వారి దగ్గరకే కొట్టుకుని వస్తుంది.
కొందరు ఒడ్డున నిలబడి చెప్పుల లాంటివి మునిగి పోనివి సముద్రంలోకి విసిరేస్తూ వుంటారు. అవి వేసిన వారి వైపే కొట్టుకొని రావడం చూస్తుంటాం.
ఇక్కడ మంచి మనిషిని సముద్రంతో పోల్చారు. సముద్రమంత సహనంగా మనుషులు ఉండాలి. అలాంటి వాళ్ళకు హాని చేయాలని చూస్తే వారికే హాని కలుగుతుందనే అర్థంతో ఈ న్యాయము చెప్పబడింది.
"ఆకాశంపై ఉమ్మితే, ఊసిన వాళ్ళ మీదే పడుతుంది" అనే సామెత దీనికి సరిగ్గా సరిపోతుంది.
"చెరపకురా చెడేవు" అని కూడా అంటుంటారు.
మనం మంచివాళ్ళమే కాబట్టి మనకా సమస్యే లేదు. "సముద్రకిట్ట న్యాయము"తో పోల్చే అవసరమే రాదు. కానీ అలాంటి దుర్మార్గమైన పనులు చేసిన వారికి తగిన శాస్తిలా చెడు జరిగినప్పుడు ఈ న్యాయం మీకైనా నాకైనా చటుక్కున గుర్తుకు వస్తుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి