నీ మాటలు;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కృష్ణా గోదావరీ సమీరాలు
మంజుల వాగ్విలాసాలు
వాణీ వీణానిక్వణాలు
మధుర మురళీ నిస్వనాలు
వెన్నెల సైకత విహారాలు
పండువెన్నెల్లో మల్లెల వానలు
నిగూఢ సందేహాలు
మర్మ సందేశాలు
పూర్ణ సంతోషాలు
నీ మాటలే ప్రియా!!
*********************************

కామెంట్‌లు