శ్రీ రాముడు ; కొప్పరపు తాయారు
 స దేవర్షి గణం తుష్టం రాఘవస్య మహాత్మనః |
బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వ దేవతైః
అభ్యషిచ్య చ లంకాయాం రాక్షస ఇంద్రం విభీషణం |
కృతకృత్యః తదా రామో విజ్వరః ప్రముమోద హ |
మహాత్ముడైన శ్రీరాముడు ఆదుష్టరావణుని 
అంతమొందింపగా దేవతలతో, ఋషులతో, 
సకలచరాచరములతోగూడిన ముల్లోకములును 
సంతసించినవి. 
పిదప శ్రీరాముడు రాక్షసశ్రేష్ఠుడైన విభీషణుని లంకా 
రాజ్యమునకు పట్టాభిషిక్తునిగావించెను. అట్లు 
కృతకృత్యుడైన రాముడు ప్రసన్న 
మనస్కుడయ్యెను.
                   శ్రీ రామం
                   ****
                

కామెంట్‌లు