* వారసత్వ సంపదలు ల- కోరాడ నరసింహా రావు !
పండుగల పరమార్ధం... 
   జన జీవన సౌభాగ్యం !
 హిందూ పండుగలంటే... 
    భక్తి, శ్రద్ద, ఆనందాలు..., 
 పరిశుభ్రత విందు, వినోదాలు !
 చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతాలు... !
 అజ్ఞానమును తొలగించు జ్ఞాన ప్రకాశాలు !!

  ఫలించిన శ్రమకు.... 
   ఆనందోత్సా హార్నవాలు !
  ధర్మ నిరతికి... 
  త్యాగ బుద్ధికి నిదర్శనాలు !!

యుగాది ని... పారవశ్యపు సహజ ప్రక్రుతి ఆనంద సౌo దర్యoతో సంధానించి... 
  ఆరాధించే... విశిష్ట మానవ జీవన విధానాన్ని ప్రకటించే ఔన్నత్యం... హిందూ పండుగల వైశిష్ట్యం... !!

సమాజంలోని అన్నివర్గాల జీవనోపాధికి... పరస్పర ప్రోత్సాహ  పరోక్ష సహకార 
 సమున్నతాలు, మన హిందూ  పండుగలు !!

సమాజ వికాస హేతువులు... 
 సమైక్య జీవన ధాతువులు 
  మన హిందూ పండుగలు 
 పెద్దలిచ్చు వారసత్వ సంపదలు !!
    *******
కామెంట్‌లు