నూతన గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ.

 రాజాం రచయితల వేదిక సభ్యులు,
కడుము వోని పాఠశాల సాంఘిక శాస్త్రోపాధ్యాయులు, దశుమంతపురం పూర్వ ఉపాధ్యాయులైన కుదమ తిరుమలరావు, దశుమంతపురంలో నూతనంగా నెలకొల్పిన గ్రంథాలయానికి, ఇరవై ఐదు పుస్తకాలను బహూకరించారు.
1923 నవంబర్ 25వ తేదీన వెలసిన దశుమంతపురం పాఠశాల 
నేటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. 
ఈ శతాబ్ది మహోత్సవం నిర్వహించిన శుభసందర్భంగా గ్రంథాలయం స్థాపించగా, తిరుమలరావు ప్రోత్సహిస్తూ ఈ పుస్తకాలను అందజేసారు. 
అన్ని వర్గాల పాఠకులకూ ఎంతగానో ఉపయోగపడే ఈ గ్రంథాలను
మండల విద్యా శాఖాధికారులు డి.గౌరునాయుడు, 
ఆర్.ఆనందరావుల చేతులమీదుగా తిరుమలరావు అందజేసారు.
మంచాలశివ "కవన కిరణాలు", చింతా అప్పలనాయుడు "అరసేతిలో బువ్వపువ్వు", దినవహి సత్యవతి "ఇంద్రధనుస్సు", డా.సమ్మన్న ఈటెల "అక్షర హారతి", బి.వి.రమణయ్య "నిజమునెరుగు", చిలకమర్తి లక్ష్మీనరసింహం "గయోపాఖ్యానం", బత్తుల ఈశ్వర్ "బత్తులవారి శతకం", ఎల్.ఆర్.వెంకటరమణ "కవిత్వోదయం", అంబటినారాయణ "ఊరిచివర ఒంటరిగుడిసె", పి.అనంతరావు "శ్రామిక ధరిత్రి", ఎ.సురేష్ "లైఫ్ హాలీడే", యల్లాప్రగడ ప్రభాకరరావు పంగులూరి హనుమంతరావు "శ్రీసత్యనారాయణా! శతకం", విశాఖపట్నం సి.ఐ.టి.యు. "విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు", బోజంకి వెంకట రవి "పగలే వెన్నెల", బలిజేపల్లి లక్ష్మీకాంత కవి "సత్యహరిశ్చంద్రీయం", ఉప్పలూరి మధుపత్ర శైలజ "మధుమాలిక", తక్కెడ శిల జాని భాషాచరణ్ "అఖిలాశ", విజయనగరం సాహితీ స్రవంతి "నేలతల్లి పొత్తిళ్ళలో", చెళ్ళపిళ్ళ సన్యాశిరావు "చైతన్య దీపిక", కె.ఎస్.రామచంద్రమూర్తి కాండూరి "అల్పసంతోషం", కాళహస్తి తమ్మారావు "హనుమద్రామ సంగ్రామం", పిల్లి హజరత్తయ్య "వెలుగు దివ్వెలు", డా.పి.రమేష్ నారాయణ టి.వి.రెడ్డి "తెలుగు వెలుగు కవితా విపంచి", నల్లి ధర్మారావు "వీరగున్నమ్మ కళింగ సివంగి", మరియు భగవద్గీతలనే ఇరవై ఐదు పుస్తకాలను తిరుమలరావు బహూకరించారు. 
ఈ సందర్భంగా మండల విద్యా శాఖాధికారులు తిరుమలరావును అభినందించారు.
తమ నూతన గ్రంథాలయానికి సహకరించుట పట్ల
పాఠశాల ప్రధానోపాధ్యాయులు వూద మల్లేశ్వరరావు, ఉపాధ్యాయులు కామర్శ శ్రీనివాసరావు, గంట ప్రసాద్, సాధుజోడు రామకృష్ణారావు, పాండ్రంకి నాగేశ్వరరావు, నులకజోడు గౌరిలతో పాటు సభికులంతా తిరుమలరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
కామెంట్‌లు