శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 శాలివాహన శకం అని వింటాం.క్రీ.పూ.230_227 వరకు శక్ సంవత్ అని హిందీలో అంటారు.పురాణాల్లో వీరికి ఆంధ్ర భృత్యులు అని పేరు.వీరికులనామం శాలివాహన లేక శాతవాహన.శాతవాహన శాతకర్ణి ఒకే అర్థం.తమిళగ్రంథాల్లో నూరువరకణ్ణర్ కి సంబంధించినవారు అని చెప్పడం జరిగింది.వందమంది జనం అని అర్థం.ఆర్యమంగోల్ జాతి అని అంటారు.కర్ణీ అంటే ఏనుగు.శాతకర్ణి అంటే వంద ఏనుగులున్నవాడు.వీరు గోదావరి కృష్ణా మధ్య ప్రాంతంలో వారని అశోకసామ్రాజ్యం ఉండేది అని కొందరి అభిప్రాయం.ఈశాతవాహన మూలపురుషుడు సిశుక్ సీప్రక్ లేక సింధుక్ అనేవాడు.అశోకుని మరణానంతరం స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేశాడు.ధరణికోట రాజధాని.విభిన్న కథనాలున్నాయి. ఆద్య అనే రాజవంశం గూర్చి కథలున్నాయి. కథాసరిత్సాగరం ప్రకారం ఒక అనాధ బ్రాహ్మణ కన్యపైఠణ్ అనే ప్రాంతంలో కుండలు చేసే వారి ఇంట్లో ఉంది.ఆమె గోదావరి ఒడ్డున ఆదిశేషుని అనుగ్రహంతో పిల్లాడిని కంటుంది.వాడిపేరుశాలివాహన.కుమారీపుత్ర నాగపుత్రుడని పిలిచే వారు ఆపిల్లాడిని.రెండేళ్ళ ఆపసివాడు మట్టితో గుర్రాలు ఏనుగులు సైన్యం తయారు చేసి పెద్ద వాడైనాక ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుని ఓడించాడు.ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.కల్పప్రదీప అనే గ్రంథం లో ప్రతిష్ఠాన్ పురంకి చెందిన ఒక పరదేశవనితకి శాలివాహనుడు పుట్టాడు.సాత్ అనే యక్షుని వాహనంగా కలవాడు సాతవాహనుడు.సతీయపుత్ర  అనేపేరు ఈవంశంకి ఉంది.మహారాష్ట్రలో సాత్పుతే అనే ఉపనామం ఉంది.శ్రీయగ్న శాతకర్ణి ఈవంశంలో ఆఖరివాడు.క్రీ.శ.165_195దాకా పాలించాడు.హిందీ లో శిక్ష అంటే విద్య చదువు.తెలుగులో దండన శిక్ష వేయటం అనే అర్థాలున్నాయి.శిక్ష్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది.నేర్చుకోడం నేర్పడం అని అర్థం.ప్రాచీనకాలంలో 6వేదాంగాల్లోప్రధమం శిక్ష.వేదాల నాసిక అని అన్నారు.అక్షరాలు గుణింతాలు స్వర ఉచ్చారణ గూర్చి చెప్పేవారు.కానీ నేడు ఏవిషయంపైన ఐనాచదవడం రాయడం నేర్వడం విద్య అంటున్నారు.ఉర్దూలో తాలీం ఆంగ్లంలో ఎడ్యుకేషన్.నైతికమానసిక శారీరక వికాసం ఆరోగ్యం కూడా విద్యయే.విద్యార్ధి స్వావలంబన సత్ప్రవర్తనలో సమర్ధుడు అవుతాడు.బ్రహ్మచారులు ఋషి ఆశ్రమాల్లో చదివారు.ప్రయాగ భారద్వాజ ఆశ్రమం తక్షశిల నైమిశారణ్యం ఉజ్జయిని వారాణసీ అమరావతి వలభీ నలందా ప్రసిద్ధ విద్యాకేంద్రాలు.కణ్వ శౌనక వసిష్ఠ విశ్వామిత్ర సందీప్ మహర్షులు ఆచార్యులు.వేదాలు తర్కం ఆయుర్వేద నీతి శిల్ప కళ జ్యోతిషం గణితం బోధించే వారు.బౌద్ధులునలందా లో శైవ వైష్ణవులు మఠాల్లో చదువు కునేవారు.కాంచీపురం మధురశృంగేరి తిరువనంతపురం గొప్ప యూనివర్సిటీలు.చైనా యాత్రికులు ఇక్కడికి వచ్చారు.మరి నేడో? విదేశీ దండయాత్రలు ఆంగ్ల పాలనలో అంతా పోగొట్టుకున్నాం.జర్మన్ వారు మన సంస్కృతం చదివి సైన్స్ లో పురోగమించారు. ప్రస్తుతం ఇస్కాన్ వారు హరేరామ హరేకృష్ణ ఉద్యమం ద్వారా ఆనాటి గురుకులం విద్య నేర్పుతున్నారు 🌷
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం