పువ్వును;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నేను
పువ్వును
ప్రకృతిని
ప్రేరేపిణిని

నేను
పరిమళమును
పొంకమును
ప్రోత్సాహమును

నేను
బాలను
కన్యను
ముత్తైదువను

నేను
సుకుమారమును
వధువును
పేరంటాలును

నేను
రంగును
హంగును
పొంగును

నేను
అందమును
ఆనందమును
ప్రాయమును

నేను
తేనెను
పన్నీరును
ప్రేమను

నేను
తియ్యదనమును
సుగంధమును
అనురాగమును

నేను
వయ్యారిని
సూదంటురాయిని
ప్రమోదాన్ని

నేను
ప్రణయాన్ని
ఆకర్షణిని
అలరింపుని

నేను
కళకళలాడుతా
కాంతులుచల్లుతా
కవితావస్తువునవుతా

నేను
కళ్ళనుకట్టేస్తా
కవ్వించుతా
కమ్మనికైతలుకూర్పిస్తా

నేను
రెబ్బలను
దండలను
అలంకారమును

నేను
తలలపైజల్లుకురిపిస్తా
మెడలనుచుట్టుకుంటా
చక్కదనాన్నిచూపిస్తా

నేను
ఉదయంపుడుతా
మధ్యహ్నంవిచ్చుకుంటా
రాత్రికివాడిరాలిపోతా

నేను
తోటల్లోయుంటా
కొప్పుల్లోనుంటా
కసువైపోతుంటా

నేను
ప్రకృతిపుత్రికని
అందానికితావుని
ఆనందదాయిని

నేను
స్వాగతంపలుకుతా
సుఖాలుపంచుతా
సంబరపెడుతా


కామెంట్‌లు