ఒట్టు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్

 ఏ ఉషోదయ భూపాలరాగమో 
నా మౌన ప్రేమగీతాలను 
స్ఫురణకు తెచ్చింది! 
ఏ సాయంత్రపు సంధ్యారాగసరిగమలో 
నా అంతరంగాన్ని
విడమరచి చెప్పింది! 
ఏ దయార్ద్రపవన గీతికాలోకనమో 
నా మాటల ఆంతర్యాన్ని
సూచించింది!
ఏ మాధవీలతా నికుంజ స్పర్మో
నా మానన సమీరాలు
జ్ఞాపకం చేసింది!
ఏ సైకతవిహారాల సుందర వీక్షణమో
నీ ఆలోచనాలోచనాలు
నాపై ప్రసరించేలా చేసింది!
ఏ శీతల చంద్రికాకిరణ ప్రసారమో 
నీ హృదయం కరిగి 
మన సంయోగాన్ని వాస్తవం చేసింది!
ఏది ఏమైనా కానీ,
చెలీ!
ఈ నిశ్శబ్ద మౌనాంధకారం
మన మధ్యకు మరెప్పుడూ రానీయకుండా 
ఒట్టేసుకుందాం!!
*********************************

కామెంట్‌లు