పల్లకిలో
కూర్చోవాలనిలేదు
బోయీలతో
మోయించుకోవాలనిలేదు
కార్లలో
తిరుగాలనిలేదు
బార్లలో
త్రాగాలనిలేదు
విమానాలు
ఎక్కాలనిలేదు
విదేశాలకు
వెళ్ళాలనిలేదు
అందంగా
తయారవాలనిలేదు
అందరినీ
ఆకట్టుకోవాలనిలేదు
పంచభక్ష్యాలు
తినాలనిలేదు
పూర్తిగాపొట్టను
నింపుకోవాలనిలేదు
ప్రశంసలను
పొందాలనిలేదు
పేరుప్రఖ్యాతులు
ప్రాప్తించాలనిలేదు
ఆడంబరాలకు
పోవాలనిలేదు
సొంతడబ్బాను
కొట్టుకోవాలనిలేదు
జేబులు
నింపుకోవాలనిలేదు
మోసాలు
చెయ్యాలనిలేదు
గోతులను
తియ్యాలనిలేదు
గుంటలందు
తొయ్యాలనిలేదు
అబద్ధాలు
చెప్పాలనిలేదు
నిజాలను
దాచాలనిలేదు
కానీ
అందాలను
చూడాలనియున్నది
ఆనందమును
అందుకోవాలనియున్నది
అనుభూతలను
పంచాలనియున్నది
అంతరంగాలను
ఆహ్లాదపరచాలనియున్నది
కలమును
పట్టాలనియున్నది
కాగితాలను
నింపాలనియున్నది
అక్షరాలను
అల్లాలనియున్నది
పదాలను
పేర్చాలనియున్నది
ఆలోచనలను
ఊరించాలనియున్నది
పంక్తులను
పారించాలనియున్నది
తక్కువమాటలను
వాడాలనియున్నది
ఎక్కువభావమును
తెలుపాలనియున్నది
వెలుగులు
చిమ్మాలనియున్నది
చీకట్లను
పారద్రోలాలనియున్నది
ఆకాశానికి
ఎగిరిపోవాలనియున్నది
అంబుదాలనెక్కి
స్వారీచేయాలనియున్నది
అద్భుతకవితలను
సృష్టించాలనియున్నది
పాఠకులమదులను
స్ఫురించాలనియున్నది
నాణ్యతను
నిలుపుకోవాలనియున్నది
నిపుణతను
నిరూపించుకోవాలనియున్నది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి