కన్నీటి వర్షాన్ని
చిరునవ్వు గొడుగుతో
ఆపేవారెందరో!
మనసులో గాయాన్ని
పెదవులపై నవ్వుతో
కప్పేసేవారెందరో!
గుండెలోతుల ప్రేమని
గొంతులోనే ఆపేసేవారెందరో!
అంతులేని అయిష్టాన్ని
అంతరంగంలోనే అణిచేసేవారెందరో!
లేనివి ఉన్నట్టు గొప్పగా
నటించేవారెందరో
ఉన్నదున్నట్టు తప్పక
నెట్టుకొచ్చేవారెందరో
ఉన్నా తనివితీరా
అనుభవించలేని సంపదలెందరివో!
దొరికినదే సంపదగా భావించే
సంతోష తృప్తహృదయాలెన్నో!
అన్నీ ఉండీ ఎవరూలేక
అనుభవించలేని బ్రతుకులెన్నో!
ఏమీలేకపోయినా అందరూ తమవారే
అనుకుని కలిసిపోయే మనసులెన్నో!
చేయని తప్పుకు శిక్షలు
అనుభవించేవారెందరో!
తప్పులు చేసీ శిక్షలు
తప్పించుకునేవారెందరో!
విలువలు నమ్మి వదలక
పాటించే వారెందరో!
కోటిరకాల సమస్యలున్నా
రేపటి కోసం చీకటి రెప్పల
తెరతీసే తూరుపుకై
ఎదురుచూసే మానవాళికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి