@ నేను - నాది... !
*****
నేను... నేను... అనుకుంటున్న
ఈ నేనే... నేను కానపుడు...,
ఇంక నాది... అనేదేముంది!?
....... ఈ లోకం లో !!
*******
. @ బంధాలు.... !
*****
ఈ సంబంధాలు, అనుబంధాల, బంధాలన్నీ
ఈ ఒంట్లో... ఊపిరాడేవరకే ... !
అనుకుంటే....,
నా ఆరోగ్యము, ఐశ్వర్యము తోపాటు.... అన్నీ ...
. తెగిపోయాయే... !!
అన్నీ అవసరాలు - అవకాశాల బంధాలేనా !!!
. ******
* ఇంతేనా.... ! *
*****
సుఖపడటం కోసం....
ఎంతో కష్ట పడి...
లెక్కకు మిక్కిలిగా సంపాదించినా ...,
ఇప్పుడూ... సుఖంలేదు...
నయం కాని ఈ దీర్ఘ రోగాలతో... !
అంతా... దుఃఖమే...
మనిషి జీవితమింతేనా .. !!
********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి