లక్ష్మమ్మ పద్యాలు;- డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
ఆవె: సిరిని పొంది జనులు  శ్రీమంతు లయ్యినా
చెంత నున్న సిరియె చింత నిచ్చు
సింధుజమ్మ నెపుడు స్థిరముగా నుండక
చంచ లత్వమొంద జడ్డ దెచ్చు

ఆవె:లక్ష్మి పూజ లింట లక్షణంబుగజేసి
లక్షలాది ప్రజలు రమను వేడు
లక్ష, కోట్ల ధనము లచ్చినీ నిమ్మంటు
 లక్ష మెట్టి జేయు లంబ సేవ


కామెంట్‌లు