జమ్మూకాశ్మీర్ లో జరిగే జాతీయస్థాయి SGFI జూడో పోటీలకు కు గుడిబడి విద్యార్థులు
 జమ్మూకాశ్మీర్ లో ఈనెల 16 నుండి 18 వరకు జరిగే జాతీయ స్థాయి (ఎస్.జి.ఎఫ్.ఐ.)స్కూల్ గేమ్స్ ఫెడరే
షన్ ఆఫ్ ఇండియా జూడో పోటీలకు వరంగల్,కాశిబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాల,నరేంద్రనగర్ కు చెందిన ఇద్దరు బాలికలు వాంకిడి సిరిచందన,సింగారపు మనస్విని
ఎంపికయ్యారు. 
 ఈ నెల 2న వరంగల్ ,కెమిస్ట్రీ భవన్ లో జరిగిన (ఎస్.జి.ఎఫ్.ఐ.)స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతెలంగాణ రాష్ట్రస్థాయి జూడో పోటీలలో వరంగల్,కాశిబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాల,నరేంద్రనగర్   బాలికలు 27 కే.జి. విభాగంలో వంకిడి సిరిచందన (7ఎ.), 32 కే.జి. విభాగంలో సింగారపు మనస్విని,(8 సి) విజేత
లుగా నిలిచి జాతీయ స్థాయి జూడో పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించనున్నారు.బలభద్ర హరిహరణ్,అజ్మీరా అక్షయ్, మునావత్ స్వాతి సిల్వర్ మెడల్స్ ,మంద సందేశ్ కు బ్రాంజ్ మెడల్ సాధించారని ఆయన తెలిపారు. 
      ఈ విజయానికి కృషిచేసిన జూడో కోచ్ జల్లెల లింగ
మూర్తిని ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం పాఠశాల ప్రార్ధన వేదిక పై ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు కుమార స్వామి సత్కరించారు.ఫిజికల్ డైరెక్టర్ వై.నారాయణ,
వ్యాయామోపాధ్యాయులు.డి.అశోక్ తదితరులను కుమారస్వామి సీనియర్ ఉపాధ్యాయులు అజయ్ ,శ్రవణ్ తదితరులు అభినందించారు. ఈ నెల 12 వ తేదీన బాలి
కలు సిరిచందన ,మనస్విని, కోచ్ జెల్లెల లింగమూర్తి జమ్మూకాశ్మీర్ కు బయలుదేరనున్నారని ఆయన తెలి

పారు.
కామెంట్‌లు