అనగనగా అవుసలపల్లి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కృష్ణ, సాయి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు.ఇద్దరే అన్నదమ్ములు కావడంతో వారికి అక్కలు చెల్లెళ్లు ఎవరూ లేరు. ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవారు. తాము చదువుకున్న పాఠశాలలో అయినా, గ్రామంలో అయినా చాలామందిని సొంత అక్క చెల్లెలుగా పిలుచుకుంటూ సంతోషించేవారు.
గ్రామంలో కూడా కృష్ణ, సాయి ఇద్దరు మంచివారుగా ఉంటూ, అందరినీ పలకరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అనుకోకుండా వారిద్దరు ఒకరోజు చిన్న విషయానికి గొడవ పడతారు. ఇద్దరు కూడా మాట్లాడుకోవడం లేదు. ఎదుటి వ్యక్తులను సోదరులు, సోదరీమణులుగా భావించి పలకరించే, ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకోపోవడం అందరూ ఆశ్చర్యపోతారు.
ఒకరోజు ఇద్దరు వేరువేరుగా బడికి పోతుంటారు. కానీ వారితో గ్రామస్తులు ఎవ్వరు కూడా మాట్లాడడం లేదు. కృష్ణ, సాయి లు వేరువేరుగా వారిని పలకరించినా తిరిగి సమాధానం ఎవ్వరు ఇవ్వడం లేదు. ఆరోజు ఇద్దరికీ రాత్రి మనసున పట్టలేదు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కలిసి బడికి వెళ్ళసాగారు. ఎదురైనా ప్రతి ఒక్కరు కూడా కృష్ణ, సాయి లను పలకరించారు. అప్పుడు వారిద్దరూ తమ తప్పుడు తెలుసుకొని ఎప్పుడు గొడవలు పడకుండా కలిసిమెలిసి ఉండసాగారు. వారిని చూసి గ్రామంలోని అన్నదమ్ములు, అక్కాచెల్లెలు అందరూ కూడా కలిసి ఉండడం అలవాటు చేసుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి