రైతు బిడ్డలు;- మాలోత్ లక్ష్మణ్- ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్- మెదక్ జిల్లా-9550809625

   అనగనగా శుక్లాల్ పేట అనే గ్రామం ఉంది. గ్రామంలో రామయ్య, లక్ష్మీ అనే దంపతులు వ్యవసాయం చేస్తూ జీవితం గడిపేవారు. వారికి రాము, మధు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ కూడా ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. ఒకసారి రామయ్య, లక్ష్మిలకు బాగా జ్వరం వచ్చింది. వారం రోజులపాటు ఇంట్లోనే ఉండసాగారు.
              వారిద్దరికీ జ్వరం వచ్చింది కంటే వ్యవసాయం ఎలా ఉందో, ఏమో పొలం ఎండిపోయింది ఏమోనని వారికి బెంగ ఎక్కువ అయింది. వారికి జ్వరం తగ్గగానే మొదట వాళ్ళు పొలం వద్దకు వెళ్లి చూశారు. పొలం మడినిండా నీళ్లు ఉండి, పొలం పచ్చగా ఉండడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. బావి దగ్గర ఏదో అలజడి కావడంతో రామయ్య, లక్ష్మీ లు వెళ్లి చూశారు. ఆశ్చర్యం రాము, మదు లు బావిలో నుంచి నీళ్లు తోడుతూ పొలానికి పోస్తున్నారు. దంపతులిద్దరూ బిడ్డలను చూసి సంతోషించారు.
           రాము, మధు లు ప్రతిరోజు బడికి వెళుతూనే తీరిక సమయాల్లో వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయపడసాగారు. సెలవు రోజు తప్పకుండా పొలం పని చేస్తూ, పొలం వద్దకె పుస్తకాలు తెచ్చుకుని చదువుకునేవారు. ఇద్దరు గ్రామంలో బాగా చదువుకొని, పై చదువులకే పట్నం వెళ్లి ఉద్యోగాలు పొందారు. ఉద్యోగాలు చేస్తూ కూడా తీరిక సమయంలో  రాము, మధు లు వ్యవసాయ పనులుచేసేవారు. అందరూ రాము, మధు లను రైతుబిడ్డలుగా పిలిచేవారు. రైతు బిడ్డలు అని అందరూ అంటుంటే రాము, మధు లు ఆనందించేవారు. వారిద్దరిని చూసి ఎంతోమంది చదువుతూనే, తల్లిదండ్రులకు వ్యవసాయ పనులలో సహాయపడసాగారు.
కామెంట్‌లు