అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఏకాదశ యాత్రకు బయలుదేరారు రెడ్డి గారు  వారి బృందంతో  కరకంబాడి తాటి కోన యాత్ర చేయాలి అన్నది సంకల్పం  తిరుపతిలో ఎస్వీ భక్తి ఛానల్ లో పనిచేస్తున్న ప్రముఖ వారసత్వ కార్యకర్త డివి రమణ గారు  శివ నాగిరెడ్డి గారి మిత్రుడు ఆయన తిరుమల కొండల్లోనీ తీర్థాలనింటిన్ని కాలి నడకన వెళ్లి అడుగుజాడల్ని నిరంతరం గాలిస్తూ  పాత చరిత్ర వాసనలను పీలుస్తూ ఉంటాడు సుదూర ప్రాంతాల్లో అడవులలో కొండలలో కోనల్లో శిథిలాలయాలు మంటపాలు శిల్పాలు శాసనాల ఆనవాళ్లు చేజిక్కించుకుంటాడు. ట్రెక్కింగ్ అంటే ఆయనకు మక్కువ ఫోటోగ్రఫీ ఆయన హాబి  చూసింది పరిశీలించింది అక్షర రూపంలో అందించడం ఆయనకు అలవాటు  ఆదివారాలన్నీ ఆయనకు కాలినడక సమాహారాలే  ప్రతి మాట వినసొంపే ప్రతి రచన ఆసక్తికరమైన వందకు పైగా వారసత్వం నడకలని ట్రెక్కింగ్ లోనిర్వహించి  మెళకువలపై ఒక పుస్తకాన్ని వ్రాశారు కూడా. ఆ పుస్తకం చదివిన తర్వాత రమణ గారితో రెడ్డి గారికి  కొన్ని గ్రామాలు తిరగాలి అన్న కోరిక కలిగింది అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు తిరుపతి వెళ్లడానికే అనుకుంటున్నారో లేదో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా వైస్ చైర్మన్  హరికృష్ణ గారి నుంచి తిరుపతికి ఆహ్వానం రాను పోనూ విమానయానం చక్కటి ఆతిథ్యం  ఓకే ప్రయాణంలో రెండు ప్రయోజనాలు హరికృష్ణ గారు ఫోన్ లో తిరుపతి చుట్టుపక్కలగల నిర్లక్ష్య వారసత్వ కట్టడాలను పదిలపరిచి వాటి చుట్టూ ఆహ్లాదకర ఉద్యానవనాలను ఏర్పాటు చేయబోతున్నామని ఆ కట్టడాలను మరమ్మత్తులు చేసే విషయంలో సలహాలు రెడ్డి గారిని ఇవ్వమని చెప్పారు  తిరుపతి వెళ్ళగానే కారు సిద్ధంగా ఉంది బి.వి.రమణ గారు కూడా సన్నద్ధం తిరగడానికి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా కరకంబాడికి వెళ్లారు.
కరకంబాడి పక్కనే ఉన్న దేశాంతర మండపం దగ్గరికి అప్పటికే హరికృష్ణ గారు తుడా ఇంజనీరు వచ్చారు  ఈ దేశాంతర మండపం గురించి రెడ్డి గారికి మొదటిసారిగా చెప్పింది ప్రముఖ సాహితీవేత్త జానపద విజ్ఞాన ఖని కథకుడు తిరుమల కథలు తిరుపతి కథలు తిరుమల తిరుపతి కథలు రాసిన ఆచార్య పేట శ్రీనివాసులరెడ్డి (పేట శ్రీ) అక్కడ ఒక విశాలమైన చెరువు ఆ చెరువుకు ఒక ప్రక్కగా 16 కాళ్ళ (స్తంభాల) మండపం ఎప్పుడో 16వ శతాబ్దంలో (వివిధ దేశాల నుంచి మన దేశంలో మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను దేశాలనే వారు కళింగ దేశం కన్నడ దేశం అరవ దేశం)లో  లా  వెంకటేశ్వర స్వామినీ దర్శించుకోవడానికి వంటా వార్పు చేసుకొని ఒక కొలుపు తీసి మళ్లీ పిల్లాపాపలతో కొందరు పయనం అవడానికి నిర్మించిన మండపం  సదాశివరాయల కాలంలో  నిర్మించారని పేట శ్రీ గతంలో చెప్పిన విషయం గుర్తొచ్చింది  రెడ్డి గారికి.


కామెంట్‌లు