హరివిల్లు రచనలు - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,--9440522864.
 హరివిల్లు 546
🦚🦚🦚🦚 
సకల కార్య కారణ
సిద్ధికి కిరణ్మయుడు........!
లోక శోక నివారణల
సూర్యనారాయణుడు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 547
🦚🦚🦚🦚
తను ఆడిన పందెంలో
ఓడిపోవుటే లేదట.......!
తను పట్టిన కుందేలుకు
కొమ్మలు మొలిపిస్తాడట....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 548
🦚🦚🦚🦚
ప్రేమ పేర వెంటపడుచు
హద్దులు మీరిన చూపులు..!
దినదినం దిగజారిన
అస్తవ్యస్త దుస్థితులు.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 549
🦚🦚🦚🦚
వయసు ఉధృతి నెపంతో
వావి వరుసలు మరువకు....!
వరుస సమస్యల మిషతో 
సమయపాలనలు మరువకు...
🦚🦚🦚🦚
హరివిల్లు 550
🦚🦚🦚🦚
కలలు కొన్ని నిజాలవక
అలలై విస్ఫోటనం.........!
కొలతలు ప్రస్ఫుటాలవక
కన్నీళ్ళై ప్రకటనం.........!!
               ( ఇంకా ఉన్నాయి )

కామెంట్‌లు