హరివిల్లు రచనలు -కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,9440522864.
 హరివిల్లు 556
🦚🦚🦚🦚 
అహింస శాంతి సహన
బాటలలో లీనమయ్యె.....!
భరత జాతికై తపించి
మన జాతిపితయయ్యె......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 557
🦚🦚🦚🦚
మీకు నేనున్నానను
భరోసా నేనివ్వాలి......!
మనకు మేమున్నామను
భరోసా వారివ్వాలి.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 558
🦚🦚🦚🦚
ఎగిసి పడే కెరటాలు
లాగేసే సాగరాలు......!
మిడిసిపడే మనుషులు
బంధాల సంసారాలు......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 559
🦚🦚🦚🦚


ముక్తికై మూలమెరిగి
అలవరచుకో సంతృప్తి.....!
సంపదలు సరితూగవు
కాలమందవి సమాప్తి........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 560
🦚🦚🦚🦚
దుక్కి దున్ని కష్టపడే
రైతులకు దక్కు ఫలితం.....!
దిష్టిబొమ్మలా చూస్తూ
విస్తుపోవు దుశ్చరితం.........!!
               ( ఇంకా ఉన్నాయి )
కామెంట్‌లు