ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 మరుపూరి కోదండరామిరెడ్డి గారు  మా కేంద్రానికి వచ్చిన ప్రతిసారి  నాన్నగారు వచ్చి కలిసి ఆయనతో మాట్లాడటం  ఆనవాయితీగా ఉంది  వేమన పద్యాలను  క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి రెడ్డి గారు. దానిలో ధర్మాన్ని ధర్మ సూక్ష్మాన్ని కూడా వివరించే వారు నాన్నగారు  వారిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు  నాలా శ్రోతగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎంతో జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా పొందటానికి అవకాశం ఉంది. మనకు తెలియని అనేక విషయాలను గురించి  ఒకరికొకరు వివరణ ఇచ్చుకుంటూ  వేమన గారి పూర్తి మనస్తత్వాన్ని  ఆవిష్కరించడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ  వారిద్దరూ మాట్లాడుతున్నప్పుడు నాలాంటి  వారు పది మంది కూర్చుని ఉండేవారు వారందరికీ అది పాఠం.
జీవితంలో  ఆదర్శ భావాలకు ఆదర్శంగా నిలబడిన వ్యక్తులలో మొదటిగా చెప్పుకోదగిన వారు  మూర్తి రాజు గారు  వారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా  జైలు శిక్ష అనుభవించి  స్వాతంత్ర్యసముపార్జన కోసం  ఎన్నో త్యాగాలు చేసిన  మహాత్మా గాంధీజీ మాటలను ఆచరణలో పెట్టిన ఉన్నత వ్యక్తి  వారు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో వ్యవసాయ శాఖా మాత్యులుగా కూడా ఉన్నారు.  ఆ సమయంలో వామపక్షపాతులు కొంతమంది  సమ సమాజం కోసం ప్రభుత్వం  కొన్ని ప్రయత్నాలు చేయాలి. భూమి ఎవరి సొత్తు కాదు దానికి అధికారులైన జమీందారు నుంచి  రెండు ఎకరాలు మించి పొలం ఉన్న వారి దగ్గర నుంచి  పొలాన్ని స్వాధీనం  చేసుకొని లేనివారికి రెండు ఎకరాల చొప్పున  పంచితే బాగుంటుంది అన్నప్పుడు. దానికి సమాధానం చెప్పడం కోసం మూర్తి రాజుగారు లేచి ఏదైనా ఒక విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నప్పుడు దాని పూర్వాపరాలు తెలిసి ఉండాలి  అది ఆచరణ యోగ్యము  అవునా కాదా అన్న విషయాన్ని  ఆలోచించాలి  ఆలోచన వేరు ఆచరణ వేరు  నాకు 16 వేల ఎకరాల భూమి ఉంది. మా గ్రామంలోనే కాక చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్న బీద వారందరికీ రెండు ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు పంచాము నాకు సెంటు భూమి లేదు  నా శ్రీమతి కూడా  మంచి మనసు కలిగినది కనుక ఆమెకు ఉన్న 18,000 ఎకరాల భూమిని కూడా  నేను దానం చేయడానికి అంగీకరించింది  ఆ మొత్తం   బీదలకు పంచాం ప్రస్తుతం నాకు ఇల్లు తప్ప మరి ఏమి లేదు.


కామెంట్‌లు