ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 ఛైర్మన్ ఆరవ ప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తూ రెండవ రోజు శర్మ గారు వారి ఇంటి మెట్లు ఎక్కుతూ గుండెపోటు వచ్చి మరణించారు. మేమంతా అక్కడికి వెళ్లి సక్రమంగా కార్యక్రమాన్ని నెరవేర్చడం ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ప్రకటన కూడా పంపించారు  తరువాత శివరామ రెడ్డి గారిని తీసుకొని దాదాపు 45-50 ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత నాకు కుదరదని ఆయన మానేశారు  అప్పుడు ఎన్టీఆర్ తో నటించిన రాజుపేద చిత్రంలో  సుధాకర్ ని పిలిచి హీరోగా చేశారు  అతను విజయవాడ లాడ్జిలో రిహార్సు జరుగుతున్న సమయంలో తాగి వచ్చేవాడు  లక్ష్మీ నరసయ్యకు తాగుడన్న వ్యభిచారం అన్న నచ్చదు దాంతో మళ్లీ నా దగ్గరకు వచ్చి  తిరిగి నాటకంలో ప్రధాన పాత్ర వహించమని కోరారు.
తరవాత సి రామ్మోహన్రావు  చైర్మన్ గా  చదలవాడ కుటుంబరావు నల్ల రామూర్తి నండూరి సుబ్బారావు గార్ల హాస్య పాత్రలతో  100 వ ప్రదర్శన తర్వాత  ఆ నాటకాన్ని ఆపు చేశాం  తర్వాత సినీనటుడు కృష్ణ కొడాలి గోపాల్ రావును నన్ను మద్రాస్ పిలిచి తనకోసం ఓ మంచి  సినిమా రాసి పెట్టమన్నాడు. విజయ నిర్మలతో  కొడాలి నేను నాటకం రాసి ఇస్తాను దాని స్క్రీన్ ప్లే ఇప్పుడే మీరు రాసుకోండి అని చెప్పాడు సరేనని గుడ్ లక్ హోటల్లో రూమ్ తీసుకొని నన్ను  గోపాలరావుని అక్కడ పెట్టి వ్రాయించారు కృష్ణ గారి తమ్ముడు కావలసిన ఏర్పాట్లు అన్నీ చూస్తూ ఉండేవాడు పూర్తి నిడివి నాటకాన్ని టైప్ చేయించి విజయనిర్మలకు ఇస్తే ఆమె మా ఇద్దరికీ థాంక్స్ చెప్పిమా ఇద్దరి చేతుల్లో రెండు కవర్లు పెట్టింది  నేను వద్దని చెప్పాను. నేను ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో  పనిచేస్తున్న రోజులలో  రామాయణాన్ని గురించి చెప్పగలిగిన శ్రీమాన్  అప్పలాచార్యులు  గారితో పరిచయం ఏర్పడింది  మాకు ఎన్నో  ప్రసంగాలు చేశారు చర్చా కార్యక్రమాలలో పాల్గొన్నారు గోష్ఠి కార్యక్రమాలలో  చక్కటి సూచనలిస్తూ మాట్లాడేవారు  ఒకరోజు మీ మాటల్లో మీ జీవితం వీడియో రికార్డు చేస్తాను అంటే  నాకన్నా పెద్దవారు ఉన్నారు కదా వారితో చేయండి అని అన్నారు  అలా కాదండి మీతోనే చేద్దామనుకుంటున్నాను మీరు అంగీకరిస్తే ఇంటికి వస్తాను  అని చెప్తే సరే మీ ఇష్టం  మీరు ఎప్పుడు వచ్చినా నేను  ఇంట్లోనే ఖాళీగా ఉంటాను మీరు ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే చేసుకోవచ్చు  అని చెప్పిన తర్వాత నేను నాన్నగారు బయలుదేరి వారి ఇంటికి వెళ్ళాము.


కామెంట్‌లు