ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 నేను నిన్ను ఎందుకు  అనుమతించలేదో తెలుసుకోవాలి అనుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది  కారణం తెలుసుకోకుండా కోపాన్ని పెంచుకుంటే అది మనిషికి  దురలవాటవుతుంది  నీ పేరుతో నీవు ఇక్కడకు వచ్చి ఉంటే  నీవు నా దగ్గరకు వచ్చిన మరుక్షణం నీ తల రోడ్డు మీద ఉండేది  నా సోదరా నీ ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు  నిండు జీవితాన్ని సుఖంగా  దేశం కోసం కష్టపడే నీవు  అలా ఉండాలని కోరుకున్నాను తప్ప  నీ మీద ఎలాంటి దుర అభిప్రాయం కానీ  నీతో మాట్లాడకూడదు అని  నియమం కాని నాకు లేదు  అర్థం చేసుకో అన్న తర్వాత  రాజుగారు గాంధీ గారికి పాదాభివందనం చేసి  మీ మాటల్ని తూచా తప్పకుండా  పాటిస్తాను అని మాట ఇచ్చి  తిరిగి వచ్చిన సంఘటన చాలామందికి తెలియదు  అది నాన్నగారు చెప్పిన రహస్యం.
విజయవాడ సింగ్ నగర్ లో  రాజుగారు బీదరికంలో విశాలాంధ్ర పత్రిక ఆఫీస్  నైట్ వాచర్ గా పనిచేస్తున్నాడు  విజయవాడలో ఎన్ని  కుస్తీ పోటీలు జరిగిన దానిలో ఆయన పాత్ర తీసుకొని విజయాన్ని సాధిస్తూ ఉండేవాడు  ఆయన జుట్టుతో  ఎడ్ల బండిని లాగేవాడు  జీవితంలో రాజు గారి   బలమైన కోరిక  అల్లూరి సీతారామరాజు తో కుస్తీ పట్టి  తన బలాన్ని  వారికి తెలియజేయాలని  కానీ వారిని ఇంగ్లీష్ వారు  ఉరితీసి చంపారని  తెలిసి  ఎంతో బాధలో ఉన్న సమయంలో నాన్నగారు  క్షత్రియ సభలో కలిసి  సీతారామరాజుకు మరణం లేదు  వారు ఫలానా చోట ఉన్నారు  అని వారి చిరునామా ఇచ్చి నప్పుడు  రాజు గారి ఆనందానికి అవధులు లేవు  వెంటనే ఇంటికి వెళ్లి  భార్యతో చెప్పి బయలుదేరాడు. ఎన్నో కష్టాలను ఓర్చి చివరకు వారి దర్శనం చేసుకున్నారు  కాషాయం కట్టి  గడ్డం పెరిగి ఉన్న  వ్యక్తి  చేరదీసి  నీవు వచ్చిన పని  ఏమిటి అని అడిగితే నాకు విషయం అర్థం కావడం లేదు చాలా అయోమయంలో ఉన్నాను  మీరు మరణించారని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది  అనగానే నేను మరణించలేదు  నా వేషంలో మరొక ఇద్దరు ఉంటారు వారిలో ఒకతను రజకుడు ఆయన చెరువులో స్నానం చేస్తూ వారికి కబురు చేసి నేను ఫలానా చోట ఉన్నాను అన్నప్పుడు  వారు ఎంతో భయపడుతూ  వారిని కాల్చి వేశారు  నాలో ఒక ప్రాణం పోయింది  ఆ క్షణం నుంచి నేను ఈ ప్రాంతాలకు వచ్చి  అజ్ఞాతవాసం గడుపుతున్నాను  అన్నప్పుడు ఎంతో బాధతో ఇద్దరు కన్నీరు కార్చారు.


కామెంట్‌లు