మానసమొక మదపుటేనుగు- "కవిమిత్ర" శంకర ప్రియ., శీల.,- సంచార వాణి:- 99127 67098
 🙏మదపుటేనుగు వలె
    సంచరించు మా"మది"ని
    "భక్తి"త్రాడుతో బంధించు!
    పశుపతీ! నీవే గతి! 
      (అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
⚜️పరమేశ్వరుని యొక్క పాదభక్తియనే  కట్టుకంబమునకు ... మనస్సు అనే, మదపుటేనుగును.. గట్టిగాకట్టి; స్థిరముగా బంధింపుము! అని, పరమశివుని వేడుకొనుచున్నారు, జగద్గురు ఆదిశంకరులు!
🔱త్రిపురహరా! శివా! నా మానసమొక మదపుటేనుగు! దీనిని.. ధీరత్వము  (నీయందు సడలని నిశ్చయజ్ఞానము) అనే అంకుశముచే ఆకర్షించి, వశపరచు కొనుము! అట్లే,  భక్తియనే గొలుసుతో, నీయొక్క పాదములనే కట్టుకంబమునకు; ప్రకాశించునట్టి మంత్ర యంత్రబలములతో, కదలకుండ కట్టివేయుము! పశుపతిస్వామి!
🙏 ప్రార్థనా శ్లోకము:-
     ధైర్యాంకుశేన నిభృతం 
     రభసాదాకృష్య భక్తిశృంఖలయా
     పురహర! చరణాలానే
     హృదయ మదేభం బధాన చిద్యంత్రైః!!
            ( శ్రీశివానంద లహరి, 96వ. శ్లోకము)
                 🪷🔆🪷
           🚩తేట గీతి పద్యం 
    అరయ హృదయగజమును, ధైర్యాంకుశమున 
    భక్తియను ద్రాట చిద్యంత్ర బంధనముల
   త్వత్పదాలానమున వేగబట్టి కట్టు,
   పురహరా! హర! శివ! స్ఫురదురగ హార!
          ( మధురకవి, దేవులపల్లి చెంచు సుబ్బయ్య శర్మ., )
           🪷🔆🪷
           🚩తేట గీతి పద్యము
    పురహర! ధృతి యంకుశముతో పొగరడంచి 
   బత్తిసంకెల బంధించి, చిత్తకరిని
   జేర్చి చిద్యంత్ర బలముతో శివపదమ్ము
   నందు నాలాన మనగట్టు మభవ! నీవు!!
       (రచన:-  డా. "శ్రీపాదుక" కొల్లూరు అవతార శర్మ.,)
      🕉️ నమశ్శివాయై! నమఃశివాయ!

కామెంట్‌లు