రెండు కలిస్తే!!...;- -గద్వాల సోమన్న,9966414580
చేయి చేయి కలిస్తే
చప్పట్లు మ్రోగుతాయి
మనసు మనసు కలిస్తే
మమతలే పెరుగుతాయి

బొట్టు బొట్టు కలిస్తే
చెరువులే నిండుతాయి
విత్తు విత్తు కలిస్తే
పంటలే పండుతాయి

చుక్క చుక్క కలిస్తే
మిలమిలమని మెరుస్తాయి
పువ్వు పువ్వు  కలిస్తే
పరిమళాలు కురుస్తాయి

శక్తి శక్తి కలిస్తే
బలమెంతో హెచ్చుతుంది
వ్యక్తి వ్యక్తి కలిస్తే
బంధం బలపడుతుంది


కామెంట్‌లు