అక్షరాల ఆశాభావం;- -గద్వాల సోమన్న,9966414580
మనసులోని భావాలు
తేటగా కన్పించనీ!
గొంతులోని రాగాలు
గొప్పగా విన్పించనీ!

జీవిత ఉద్దేశ్యాలు
చక్కగా నెరవేరనీ!
మహాన్నత ఆశయాలు
మెండుగా ఫలించనీ

ముఖంలో మందహాసం
ముద్దుగా  మెరువనీ!
అద్దంలో అందాలు
శ్రద్ధగా సరిచేయనీ

నోటి మాటల ముత్యాలు
చినుకులై కురువనీ!
జగమెరిగిన సత్యాలు
యేరులై ప్రవహించనీ!


కామెంట్‌లు