ఎంతో ఉపయోగం- -గద్వాల సోమన్న,9966414580
పువ్వులోని తావులు
నవ్వులోని సొగసులు
ఎంతో ఉపయోగం 
దివ్వెలోని వెలుగులు

ఏటిలోని జలములు
నీటిలోని కలువలు
ఎంతో ఉపయోగం 
నోటిలోని పలుకులు

తరువులోని ఫలములు
గురువులోని విద్యలు
ఎంతో ఉపయోగం 
మరువ లేని స్మృతులు

మల్లెలోని వన్నెలు
పల్లెలోని పైరులు
ఎంతో ఉపయోగం
తల్లిలోని మమతలు




కామెంట్‌లు