తిరుప్పావై ; - వరలక్ష్మి యనమండ్ర
తిరుప్పావై – 13వ పాశురము

పుళ్ళిన్ వాయ్ కీణ్ణానైప్పొల్లా వరక్కనై, క్కిళ్ళి క్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్, ప్పిళ్ళైగళెల్లారుమ్ పావైక్క,ళమ్బుక్కార్, వెళ్ళియెళు న్దువియాళముఱజిత్తు, పుళ్ళుమ్ శిలుమ్బిన గాణ్ పోదరి క్కణ్ణినాయ్, కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే, పళ్ళిక్కిడత్తియో పావాయ్ ! నీనన్నాళాల్, కళ్ళమ్ తవిన్దు౯ కలన్దేలో రెమ్బావాయ్
***********
13 వ పాశురం-భావము-పంచపదులలో
***********
తామర పూల వంటి కన్నులదానా
లేడి వంటి చూపులు  గల దానా
కృష్ణుని పైన అమిత భక్తిగలదానా
అందరికన్నా అందము గలదానా
బకుని సంహారి పూజకు రావమ్మా.... కృష్ణా

కదలవు మెదలవు జవాబులేదేమి
తెల్లవార వచ్చెను తెలియదా ఏమి
సూర్యుడు వచ్చెను చూడవా ఏమి
నీవు పక్షుల కిలకిలు వినలేదా ఏమి
చల్లని నీటను స్నానార్థము రావే చెలీ... కృష్ణా

సందరమైన నయనమ్ములు గలవని 
ఆ కృష్ణుడే నీ చెంతకు తానే వస్తాడని
చెప్పుటకు వస్తిమి భ్రమ పడకుమని 
నోచే నోముకు ఫలము పొందుదువని
చల్లని నీటితో స్నానము చేయగ రావే... కృష్ణా

కపట నిద్రను వీడుము ఓ చెలియా
నిద్దురవీడి మాచెంతకురావే చెలియా
వ్రత విధమును పూర్తిచేయ చెలియా
అన్నీ శుభములు జరుగును చెలియా
ఎనిమిదవ గోపికా నిద్దుర లేవే...... కృష్ణా
***********


కామెంట్‌లు