సాకీ :-
హక్కులనే... తలచి, బాధ్యతలను మరచి, బ్రతుకులు బలిచేసుకునే
దౌర్భాగ్యు లారా..... !
పల్లవి :-
ఓ సమాజ పౌరులారా... !
హక్కులనే తలఁచె రా..... !!
బాధ్యతలను మరిచేరా... !!!
ప్రజలచేత ఎన్నుకోబడి...
ప్రజలే పాలించే...
ప్రజాస్వామ్య దేశం మనది !
ప్రజా స్వామ్య దేశం మనది !!
" ఓ సమాజ పౌరు..... "
చరణం :-
నిజమైన పాలకులు...
మన ప్రజలే నని మరవద్దు !..2
మీరు మరవద్దు !!
మనకు రాజ్యాంగం కల్పించి ఇచ్చెను,* ఓటు * అనే ఆయుధాన్ని... !
" మనకు రాజ్యాంగం.... "
ఓటు విలువ ఎరుగక మీరు
దు ర్మార్గుల చే తికందిచేరా...
బుర్ర లేని గొర్రెల్లా...
కసాయి పాలు ఔతారా... ! ఓ సమాజ పియూరుల్లారా.. "
చరణం :-
మన కులమనో... మన మతమానో...
తాయిలాలు ఇస్తారనో....,... 2
ప్రలోభాలకు బలి అవ్వొద్దు...
అధోగతి పాలైపో వద్దు... !
సమాజ సర్వతో ముఖాభివృద్దితో...
కలకాలం సుఖ, సౌఖ్యాలతో
బ్రతక గలిగే అవకాశం...
మన చేతుల్లోనే... ఉంది !
ఓటును సద్వినియోగం చెయ్యాలి !
మనం సద్వినియోగం చెయ్యాలి.. !
మన ఓటును మనం...
సద్వినియోగమె చెయ్యాలీ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి