శాస్త్రీయ జీవన మార్గమే  శిరోధార్యం- శ్రీ కాజీపేట పురుషోత్తం,-రిటైర్డ్ జిల్లా అటవీ అధికారి,-హన్మకొండ, తెలంగాణ.
నుడికారపు నినాదం నాటి వందేమాతరం 
అంధకార బందురం నేటి ఈ తరం..!

ఏడుదశాబ్దాల స్వాతంత్ర్యం  
వారసత్వరాజకీయపు గణతంత్రం.!

అతి పెద్ద డెమోక్రసీ దేశం మనది
అనవసర హిపోక్రసీ వేషం గలది..!

ఆర్థిక స్వాతంత్య్రం  అంతంత మాత్రం 
అందరికీ అక్షరాస్యతా తూతూ మంత్రం ..!

స్త్రీలకు స్వేచ్చ  అలంకార ప్రాయం 
అడుగడుగున  అతివల పై అఘాయిత్యాలు హేయం..! 

బాల కార్మిక,బాల్య వివాహ వ్యవస్థ 
రద్దయినా గాని తప్పని  రహస్యపు దురవస్థ..!

యాంత్రికంగా  జాతీయపతాక వందనం
మొక్కుబడి పండుగ చేసే జనాల వైనం..!

వ్యక్తిగా  మారితేనే  వ్యవస్థ మార్పు తధ్యం 
వ్యక్తిత్వ మార్పుతోనే దేశ అస్తిత్వ స్థిరత్వం..!

మానవీయత మన నైతిక మతతత్వం 
సౌభ్రాతృత్వ సమానత్వమే మానవత్వం..!

శాస్త్రీయ జీవన మార్గమే  శిరోధార్యం
ఇంటి నుండే హేతుబద్ధత అనివార్యం..!

కామెంట్‌లు