" తెలిసినదా మీకు పిల్ల లూ..! "- కోరాడ నరసింహా రావు..!
అంకుల్...అంకుల్ కధచెప్పరూ..! 
 ఏ కధ చెప్పను చిన్నారులూ..? 

యే కధ నైనా చెప్పండి మీరు
 మీ రేకధ చెప్పినా సూపరు..!! 

చెట్టు-చెరువు.... పక్షి- పాము
 కధ లెన్నో విన్నారు గా.... 
 మన మనుషుల కధనే చెబు తాను.. 
  వింటారా... మీరు పిల్లలూ... ! 
  ఓ... వింటా0... చెప్పండి...!! 

మన ఆదిమ మానవులు... 
  పూర్వ0 ఆడవుల లోనే... 
    బ్రతికే వారు....! 

ఆకుల నే.... బట్టలు గా కప్పు కుంటు... 
  చేపలను,జంతువులను వేట ఆడుతూ... 
  దొరికినదే తింటూ... 
 కొండ గుహల్లో వుండే వారు..! 

నిప్పును తెలుసుకుని... 
  చీకట్లను తొలగించారు..! 
ఇనుమును కను గొన్నారు
 చక్ర0  సృష్టి చారు..., 
బ్రతుకున వేగం పెంచారు..!! 

వ్యవ సాయం... 
   మొదలు పెట్టి... 
  సంచార జీవితం వదిలారు
   స్థిర నివాసు లైనారు...!! 

గ్రామాలలో  నివసించేరు
 యంత్రాలను కనుగొన్నారు
  పరిశ్రమలు  స్థాపిం చి
 పట్మాలకు  విస్త రించారు ! 

నేల పైనే కాదు.... 
   నీటి పైనా... నింగి లనూ
   స్వేచ్ఛగ  విహరించారు
 అంతరిక్షాన్నే  సోధించి.! 
 విజయాలెన్నో సాధి0చారు!! 

అందు కే....! 
 సకల ప్రాణులలో....మానవులే
గొప్ప వారు ఐనారు...!! 

బోధపడి0దామీకు...పిల్లలూ....  మన మనుష్యులపుట్టు-పూర్వో త్తరాలు...!! 
  
భలే బాగుంది అంకుల్.... 
  మన మనిషి కధ భలే గా వుంది..... ।।।
     ******

కామెంట్‌లు