ప్లాష్ చిత్రకళా పోటీలలో గెలుపొందిన పెద్దెముల్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్దులు.

 వికారాబాద్ జిల్లా కొత్తగడి , శివారెడ్డి గురుకుల పాఠశాల లో స్పాష్, ఇగ్నైట్, ఆల్టో రిథమ్ పోటీలను నిర్వ హించారు. ఈ పోటీలకు హైదరాబాద్, రంగారెడ్డి, వికా రాబాద్ జిల్లాలకు చెందిన 16 గురుకుల పాఠశాలల నుండి వచ్చిన 263 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ముందుగా వివిధ పోటీలలో పాఠశాల స్థాయిలో గెలుపొందిన వారు. (పాఠశాల స్థాయి లో మొదటి స్థానం లో గెలుపొందిన వారు మాత్రమే రీజనల్ స్థాయిలో పాల్గొనటానికి అర్హులు). హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రాంతీ య సమన్వయాధికారి డాక్టర్. శారదా వెంకటేష్, పాఠశాల ప్రిన్సిపల్ పి అపర్ణ, ముఖ్య అతిథి కళారత్న మేఘన శివాని గోగు గార్లు రిబ్బన్ కటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. ఆల్ గో రిథమ్ లో భాగంగా స్టోరీ టెల్లింగ్, బుక్ రివ్యూ పోటీలు, స్పాష్ లో భాగంగా ఆబ్జెక్ట్ డ్రాయింగ్, పెయింటింగ్, కొలే జ్, బెస్ట్ అవుట్ అఫ్ వేస్ట్ పోటీలు నిర్వహించారు. ఆబ్జెక్ట్ డ్రాయింగ్లో భాగంగా తమ ముందు ఉంచిన కుండ, మగ్గు, వాటర్ బాటిల్ మొదలైన వస్తువులను నిజమైనవేమో అన్నట్లుగా విద్యార్థులు గీసిన చిత్రాలు చూపరులను అబ్బురపరిచా యి. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లో భాగంగా వేస్ట్ మెటీరియల్ తో విద్యార్థులు తయారుచేసిన ఉపయోగకరమైన వస్తువులు విద్యార్థుల కళాత్మక దృష్టికి అద్దం పట్టేలా ఉన్నా యని పలువురు అభినందించారు.       ఈ యొక్క పోటీలలో పెద్దేముల్ విద్యార్థులు తొమ్మిది ప్రైజులను గెలుచుకున్నారు. ఐదుగురు మొదటి స్థానం లో మరియు నలుగురు ద్వితీయ స్థానం లో గెలుపొందినారు. పోటీలలో గెలుపొందిన విజేతల వివరాలు:        1.ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ & శేడింగ్ విభాగం లో:  టి . మహేష్ (7వ తరగతి - సబ్ జూనియర్), కె.శ్రీను ( 9వ తరగతి - జూనియర్) పి.విశాల్ ( ఇంటర్ ఫస్ట్ ఇయర్) ఈ ముగ్గురు మొదటి బహుమతి నీ గెలుపొందారు . 2.కొ లేజ్ విభాగం లో : వి.నందు వర్ధన్ 9వ తరగతి(జూనియర్) మొదటి బహుమతిని, బి.చింటు 7వ తరగతి (సబ్ జూనియర్)రెండవ బహుమతి నీ గెలుపొందారు. 3.పెయింటింగ్ విభాగం లో : యన్. యువరాజ్, 6వ తరగతి(సబ్ జూనియర్) పి. అజయ్ 10వ తరగతి( జూనియర్)  మరియు బి. ప్రశాంత్,ఇంటర్ (సీనియర్)రెండవ బహుమతి ని గెలుచుకున్నారు. 4.బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ విభాగం లో : పి అక్షయ్ (ఇంటర్) సీనియర్ విభాగం లో మొదటి బహుమతి ని గెలుచుకున్నారు.   శివారెడ్డిపేట గురుకుల పాఠశాలలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఈ విజేతలకు  బహుమతులను అంద చేశారు. విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని బ హుమతులు గెలుచుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, కేవలం చదువే కాకుండా ఇలాంటి పోటీల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు మానసికోల్లాసాన్ని పొంది. వారిలోని సృజనాత్మకత పెంపొందుతుందని పాఠశాల ప్రిన్సిపల్ పి. సుజాత అన్నారు. ప్రిన్సిపల్ , వైస్ ప్రిన్సిపల్ డి.సుభాష్ బాబు మరియు పాఠశాల సిబ్బంది  గెలుపొందిన విద్యార్థులకు మరియు శిక్షణ ఇచ్చిన ఆర్ట్ టీచర్ డాక్టర్.గోనె లింగరాజు కి అభినదనలు తెలిపారు. ఈ రీజనల్ స్థాయి లో మొదటి బహుమతి ని గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి లో నివ్వహించే పోటీలలో పాల్గొంటారు.
కామెంట్‌లు