మేలు......! - కోరాడ నరసింహా రావు.
ఆ దేవుడు... కలడని... నమ్మి
   కొలిచెడి వారు కొందరు...! 
 లేడ ని నమ్ము వారి0కొందరు., 
అనవసర కాలయాపన, వాదు 
 లాడు చుండ్రు...! 

కలడను నమ్మిక.... పాపభీతి , 
 పుణ్య చింతనల వరకది మేలే! 
 మితి మీరి, అతి చేసి  మూడ
  భక్తి యైన కీడు గాదే.....! 

లేడ ను  భ రో సా.... 
   హింసను ప్రేరేపించిన.... 
     సమాజమున కనర్ధమే కదా

మనము వాదులాడు దేవుడు
  ఉన్నా - లే కున్నా....
 మంచి - చెడు లను నవి.... 
  లే వన గలమా....! 

మంచిని మాత్రమే ఆచరించి.... 
పసువుల వలె గాక... 
 మనుషులు, మనుష్యుల వలె
  బ్రతికిన మేలు...!! 
        ********

కామెంట్‌లు