సుప్రభాత కవిత ; -బృంద
అవనిలోని అణువణువునకూ
అందే అనుగ్రహ కిరణం
ఉదయాద్రిపై  వెలుగుపువ్వు
విరిసిన తరుణం

ప్రతి దినమొక జననం
ప్రతి కదలికా ఒక వరం
కొత్తగ దొరికే క్షణాలు
కోరకనే దొరికే వరాలు

దారిని సులువుగ చేసుకో
ఆనందం తోడుగా సాగిపో
సందేహపు తెరలు తొలగించి
సంతోషపు అరలు నింపుకో

ప్రేమను పంచితే తిరిగి
ప్రేమే  వెదుకుతూ వస్తుంది
ప్రేమైనా పగైనా
పెంచుకుంటే పెరుగుతుంది
తుంచుకుంటే తరుగుతుంది‍

ఎక్కే నిచ్చెనలెన్నో
పడ దోసే పాములెన్నో
జీవిత గమనంలో
తొలగే ముళ్ళూ కరిగేరాళ్ళూ
ఉండకపోతాయా!

ఆశే జీవన  మార్గం
మార్పే  మనుగడ సూత్రం
మరో మంచి ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు