కోరాడ అష్టాక్షరీ గీ తా లు..!

 రాధమ్మను కూడి నీవు
బృందావని లో తిరిగి
ఆట లెన్నో ఆడి నావు
 జయ కృష్ణా..! కృష్ణ ప్రియా..!! 
      *******
గోపెమ్మల ఇండ్ల లోన
నీ జట్టు గాలతో వెళ్లి
పాలు, వెన్నల దొంగవు
జయ కృష్ణా..! కృష్ణ ప్రియా..!! 
    ******
గీతను బోధిం చితివి
 బ్రతుకు దారి చూపిన
పురుషోత్తమ మురారీ
 జయ కృష్ణా..! కృష్ణ ప్రియా..!! 
********
అభిమాన్యుని మరణం
అర్జుని కలచి వేయ
 చక్ర మడ్డు వేసి నావు
 జయ కృష్ణా..! కృష్ణ ప్రియా..!!
       ******
పాండవ పక్ష పాతివా...? 
ధర్మ పక్ష పాతి వయా... 
యుగ పురుషుడ వీవు..! 
జయ కృష్ణా..! కృష్ణ ప్రియా..!! 
       ******
కామెంట్‌లు